పవన్, త్రివిక్రమ్ సినిమాకి అదే ఫార్ములా!
- June 21, 2017 / 07:11 AM ISTByFilmy Focus
తెలుగు చిత్రాలు ఇతర భాషల్లోనూ విజయం సాధిస్తున్నారు. పొరుగు రాష్ట్రాల ప్రజలు మన చిత్రాలను చూసేందుకు ఇష్టపడడంతో మన హీరోల చూపు అటు వైపు పడింది. పైగా నిర్మాతకు లాభాలు అధికంగా వస్తుండడంతో రెండు మూడు భాషల్లో రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ప్రభాస్ బాహుబలి తో, ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ తో ఇతర భాషల్లో విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు మహేష్ బాబు స్పైడర్ తో తమిళంలోకి నేరుగా అడుగుపెట్టబోతున్నారు. వారి బాటలోనే పవన్ కూడా వెళుతున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తాను చేస్తున్న సినిమాని తమిళం, మాలయంలో కూడా రిలీజ్ చేయాలనీ అనుకుంటున్నారంట.
అదే పనిలో త్రివిక్రమ్ ఉన్నారు. మూడు భాషల వారికి బాగా తెలిసిన పేరుని సినిమా టైటిల్ గా పెట్టాలని ఆలోచిస్తున్నారు. హాసిని అండ్ హారిక క్రియేషన్స్ బ్యానర్లో రాధాకృష్ణ వంద కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా రెండు రోజులుగా సారధి స్టూడియోలో షూటింగ్ జరుపుకుంటోంది. పవన్, విక్టరీ వెంకటేష్ లపై సరదా సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. అను ఇమ్మానియేల్ , కీర్తి సురేష్ లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీలో కుష్బూ కీలక రోల్ పోషిస్తోంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
















