పవన్ కళ్యాణ్ బర్త్ డే కోసం ఫ్యాన్స్ భారీ ఎత్తున సిద్ధం అయ్యారు. ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు, వేడుకలు మొదలుపెట్టేశారు. ఇక సోషల్ మీడియాలో అయితే వారు పెద్ద సంచలనానికి తెరలేపేలా ఉన్నారు. కేవలం పవన్ బర్త్ డే సీడీపీతోనే 65 మిలియన్ ట్వీట్స్ తో వరల్డ్ రికార్డు బద్దలు కొట్టిన ఫ్యాన్స్, బర్త్ డే నాడు మరింత పెద్ద టార్గెట్ సెట్ చేస్తారో అనే ఆసక్తి అందరిలో మొదలైంది. ఫ్యాన్స్ తమ అభిమాన హీరో పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరపాలని ఆరాట పడుతున్న వేళ, పవన్ తన పుట్టినరోజు పట్ల ఎలాంటి అభిప్రాయం కలిగి ఉంటారు అనేది ఆసక్తికరం.
తాజా ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ ని ఇదే విషయం అడగడం జరిగింది. పుట్టినరోజుపై మీరు అంతగా ఆసక్తి చూపించినట్లు ఉండరు కారణం అని అడుగగా, కొన్ని విషయాలు వెల్లడించారు. ఎప్పుడో చిన్నతనంలో స్కూల్ లో చాక్లెట్స్ పంచినట్లు గుర్తు. ఆ తరువాత నా బర్త్ డేపై నాకు ఆసక్తి ఉండేది కాదు. దానిని ప్రత్యేకంగా గుర్తుపెట్టుకొనేవాడిని కాదు. రెండు రోజుల తర్వాత గుర్తొస్తే వదిలిన డబ్బులు ఇచ్చేది, పుస్తకాలు కొనుక్కునేవాడిని.
హీరో అయిన తరువాత కొందరు దర్శక నిర్మాతలు పుట్టిన రోజు వేడుకలు జరపాలని చూశారు. కేక్ కట్ చేయడాలు, వాటిని నా నోట్లో పెట్టడాలు నాకు నచ్చేది కాదు, అని పవన్ ఉన్న విషయం చెప్పారు. మిడిల్ క్లాస్ మెంటాలిటీ కలిగిన నేను ఈ ఆడంబరాలను ఇష్టపడనని చెప్పారు.
Most Recommended Video
34 ఏళ్ళ సినీ కెరీర్ లో ‘కింగ్’ నాగార్జున రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!
సౌత్ లో అత్యధిక పారితోకం అందుకునే సంగీత దర్శకులు వీరే!