సినిమాలను-రాజకీయాలను సమాంతరంగా నడిపిస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్. నిన్నమొన్నటివరకు రాజకీయంగా కాస్త వీక్ గా ఉన్న పవన్ ఇటీవల జరిగిన పంచాయితీ ఎలక్షన్స్ లో తన ఉనికిని కాస్త గట్టిగానే చాటుకొని పోలిటికల్ గానూ తన పవర్ ను ప్రూవ్ చేసుకున్నాడు. అయితే.. ఒకేసారి నాలుగు సినిమాలు ఒకే చెప్పిన పవన్ కళ్యాణ్ కు ప్రత్యేకంగా పార్టీ ఆఫీస్ కి వెళ్ళే తీరిక లేకపోతుండడంతో.. సినిమా సెట్స్ లోనే పోలిటికల్ వర్క్స్ కూడా కానిచ్చేస్తున్నాడని తెలుస్తోంది.
తన పోలిటికల్ ఫ్రెండ్స్ & వర్కర్స్ ను ఏదైనా ముఖ్యమైన పని ఉంటే సినిమా సెట్స్ కి వచ్చేయమంటున్నాడట. అక్కడే షాట్ గ్యాప్ లేదా లంచ్ బ్రేక్ లో పోలిటికల్ డిస్కషన్స్ & డెసిషన్స్ తీసుకుంటున్నాడట పవన్ కల్యాణ్. పవన్ కళ్యాణ్ ఇంత సమర్ధవంతంగా పనిచేస్తుండడంపై ఆయన నిర్మాతలు, రాజకీయ అనుచరులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే.. రేపటి నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి మళ్ళీ ఫుల్ మజా మొదలవ్వనుంది.
రేపు (మార్చి 3) “వకీల్ సాబ్” చిత్రం నుండి కొత్త పాట “సత్యమేవ జయతే” విడుదలవుతుండగా.. మార్చి 11కి పవన్-రాణా మల్టీస్టారర్ సినిమా టైటిల్ ను రివీల్ చేయనున్నారు. వీటితోపాటు పవన్-క్రిష్ సినిమాకి సంబంధించిన మరో అప్డేట్ ఏప్రిల్ లో వచ్చే అవకాశాలున్నాయి. ఎలాగో ఏప్రిల్ 9న “వకీల్ సాబ్” విడుదలవుతుంది. సొ, పవన్ ఫ్యాన్స్ కి మార్చి, ఏప్రిల్ సమ్మర్ సెలబ్రేషన్స్ అన్నమాట.