Pawan Kalyan: వీరమల్లు విషయంలో పవన్ ఫ్యాన్స్ కాన్ఫిడెన్స్ ఇదే!

  • May 23, 2022 / 07:16 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు, ఇండస్ట్రీ హిట్లు ఉన్నాయి. రీఎంట్రీలో పవన్ నటించిన వకీల్ సాబ్, భీమ్లా నాయక్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. ఏపీలో టికెట్ రేట్లు అనుకూలంగా ఉండి ఉంటే ఈ రెండు సినిమాలు అదనంగా మరో 10 కోట్ల రూపాయల చొప్పున కలెక్షన్లను సాధించి ఉండేవని పవన్ అభిమానులు భావిస్తున్నారు. అయితే హరిహర వీరమల్లు పవన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

పవన్ స్టామినాను ప్రపంచం చూడబోతుందని అభిమానులు భావిస్తున్నారు. హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ నిదానంగా జరుగుతుండగా 17వ శతాబ్దంలోని మొఘలుల కాలం నాటి కథతో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. క్రిష్ ఈ సినిమా రిజల్ట్ విషయంలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా 60 శాతానికి పైగా షూటింగ్ ను జరుపుకుంది. పవన్ కు జోడీగా నిధి అగర్వాల్ ఈ సినిమాలో నటిస్తున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ ఎప్పుడూ నటించని పాత్రలో ఈ సినిమాలో నటించడం గమనార్హం.

సంక్రాంతి సీజన్ లో హరిహర వీరమల్లు సినిమా విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం. ఈ సినిమాలో గ్రాఫిక్స్ కు కూడా ఎక్కువగానే ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ ఈ సినిమాపై ఊహించని స్థాయిలో అంచనాలను పెంచింది. ఏఎం రత్నం ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రీ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

హరిహర వీరమల్లు షూటింగ్ పూర్తైన తర్వాత పవన్ భవదీయుడు భగత్ సింగ్ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుండగా పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. వరుస ప్రాజెక్ట్ లతో పవన్ కళ్యాణ్ బిజీగా ఉండటం గమనార్హం.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus