వకీల్ సాబ్ కోసం ‘అల’ టెక్నిక్ వాడేస్తున్నారు

  • March 7, 2020 / 10:09 AM IST

పవన్ కళ్యాణ్ తన కమ్ బ్యాక్ మూవీ వకీల్ సాబ్ ప్రొమోషన్స్ మొదలెట్టేశారు. నేడు ఈ చిత్రం నుండి మగువ మగువా అనే సాంగ్ ప్రోమో విడుదల చేశారు. సిద్ శ్రీరామ్ ఆలపించిన ఈ సాంగ్ కి రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. ఇక ఈ పాట ఆడవారి గొప్పతనం వారి విలువ తెలిపేదిగా సాగుతుందని మొదటి ఆ రెండు లైన్స్ వింటే అర్థం అవుతుంది. కాగా పవన్ కూడా అల వైకుంఠపురంలో ప్రొమోషన్స్ టెక్నిక్స్ వాడుతున్నాడని అర్థం అవుతుంది.

అల వైకుంఠపురంలో టీమ్ సైతం సినిమా విడుదలకు మూడు నెల ముందు నుండే సినిమాలోని ప్రతి సాంగ్ ప్రేక్షులకు చేరువయ్యేలా చేశారు. సాంగ్ ప్రోమో ఒకేసారి..తరువాత కొద్ది రోజులకు సాంగ్ విడుదల చేసి సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకున్నారు. అల వైకుంఠపురంలో ప్రొమోషన్స్ సూపర్ సక్సెస్ అని చెప్పాలి. ఇక పవన్ కూడా అలాగే సినిమాలోని పాటలను నెలల ముందు నుండే ప్రేక్షకులకు చేరువ చేసే పనిలో పడ్డారు. ఇక థమన్ కూడా సెంటిమెంట్ ఫాలో అవుతూ సిద్ధ్ శ్రీరామ్ తో ఈ సినిమాలోని మొదటి సాంగ్ పాడించారు. అల వైకుంఠపురంలో సినిమాలో కూడా మొదటి సాంగ్ సామజవరగమన..సిద్ శ్రీరామ్ నే పాడారు.


పలాస 1978 సినిమా రివ్యూ & రేటింగ్!
అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి సినిమా రివ్యూ & రేటింగ్!
ఓ పిట్టకథ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus