Pawan Kalyan Remuneration :‘గబ్బర్ సింగ్’ విషయంలో బండ్ల గణేష్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్..

Advertisement

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ‘గబ్బర్ సింగ్’ అనేది మెమరబుల్ మూవీ.. ఎందుకంటే వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న ఆయనకు సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చింది. ఈ బ్లాక్ బస్టర్ ఫిలంని ఫ్యాన్ బోయ్ హరీష్ శంకర్ తెరకెక్కించాడు. సల్మాన్ ఖాన్ నటించిన ‘దబాంగ్’ చిత్రానికి రీమేక్‌గా రూపొందించగా.. 2011 మే 11న విడుదలై అత్యధిక వసూళ్లు రాబట్టింది. శృతి హాసన్ కథానాయిక కాగా.. సుహాసిని మణిరత్నం, నాగినీడు, అజయ్, అభిమన్యు సింగ్, కోట, రావు రమేష్, బ్రహ్మానందం, ఆలీ తదితరులు కీలకపాత్రల్లో నటించారు.

రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అందించిన పాటలు, బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాను నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లాయి. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద ‘తీన్ మార్’ తర్వాత నిర్మాత బండ్ల గణేష్ చేసిన సినిమా ఇది. రూ. 30 కోట్లతో తీస్తే.. బాక్సాఫీస్ బరిలో రూ. 150 కోట్లు కొల్లగొట్టింది. తాజాగా ఈ చిత్రం గురించి, నిర్మాత గణేష్ గురించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

పవన్, బాలయ్య హోస్ట్ చేస్తున్న ‘అన్‌స్టాపబుల్’ షోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఫస్ట్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతోంది. రికార్డ్ రేంజ్ వ్యూస్ రాబడుతున్న ఈ షోలో పవన్ తన పర్సనల్, ప్రొఫెషనల్ అండ్ పొలిటికల్ కెరీర్ గురించి.. మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడారు. అలాగే మూడు పెళ్లిళ్లపై కూడా స్పందించారు. బాలయ్య – పవన్ ఇద్దిరినీ కలిపి చూడడం ప్రేక్షకాభిమానులకు సర్‌ప్రైజింగ్‌గా అనిపించింది. ఇక పవర్ స్టార్ తన సినిమాలకు సంబంధించిన రెమ్యునరేషన్ విషయంలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

బాలయ్య, ‘‘కనీసం ‘గబ్బర్ సింగ్’ కి అయినా ఇచ్చారా, లేదా?’’ అని అడగ్గా.. పవన్.. ‘‘గబ్బర్ సింగ్’ కి పాపం.. తను అనుకున్నంత ఇచ్చాడు.. నేను అనుకున్నంత ఇవ్వలేదు కానీ.. తను అనుకున్నంత ఇచ్చాడు’’ అంటూ నవ్వుతూ బదులిచ్చారు.. ‘‘లవ్ యు బాస్ పవన్ కళ్యాణ్.. అన్‌కండీషనల్ లవ్’’ అంటూ బండ్ల గణేష్ ఈ వీడియో షేర్ చేశారు.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus