పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్నికల లోపు సాధ్యమైనన్ని సినిమాలు చేయాలనీ పక్కా ప్రణాళికలతో ఉన్నారు. అందుకే వరుసగా మూడు సినిమాలకు ఒకే చెప్పారు. ప్రస్తుతం డాలీ దర్శకత్వంలో కాటమరాయుడు షూటింగ్ లో బిజీగా ఉంటూనే, అటు జనసేన పార్టీ అధినేతగా తన పార్టీ బలపర్చుకునే పనిలో పవన్ ఉన్నారు. ఇలా క్షణం తీరికలేకుండా ఉన్న పవర్ స్టార్ కి అనూప్ రూబెన్స్ కోపం తెస్తున్నట్లు తెలిసింది. ఇతను కాటమరాయుడు మూవీకి సంగీతాన్ని అందిస్తున్నారు. అద్భుతమైన పాటలను అందించే అనూప్ పవన్ చిత్రానికి ఒక పాట బ్యాలన్స్ ఉంచారని, ఇంకా ఆ సాంగ్ ని కంపోజ్ చేయలేదని సమాచారం. ఇది తెలిసి పవన్ ఆగ్రహంతో ఊగిపోతున్నారని తెలిసింది.
ఈ సినిమా చిత్రీకరణను జనవరి నాటికి పూర్తి చేయాలనీ అనుకుంటే ఒక పాట వల్ల మరికొన్ని రోజులు ఆలస్యం అవుతోందని, ఈ విషయం పవన్ సహనాన్ని పరీక్షిస్తోందని ఫిల్మ్ నగర్ వాసులు చెప్పుకుంటున్నారు. పవర్ స్టార్ కోపాన్ని తగ్గించడానికి అదిరిపోయే పాటని ఇచ్చేందుకు అనూప్ రాత్రి పగళ్లు శ్రమిస్తున్నారని ఆయన సన్నిహితులు చెప్పారు. శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ మూవీ టీజర్ జనవరి 26 న రిలీజ్ కానుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.