Pawan Kalyan: అందరి ముందే పవన్‌ కళ్యాణ్‌ కాళ్లు పట్టుకున్న అగ్ర నిర్మాత.. ఎందుకో తెలుసా?

పవన్‌ కళ్యాణ్‌.. పరిచయం అక్కర్లేని పేరు. మెగాస్టార్‌ చిరంజీవి తమ్ముడిగా సినిమాల్లోకి వచ్చిన ఆయన.. అనతి కాలంలోనే తన స్టైల్‌, నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అటు ప్రజల సేవకై రాజకీయాల్లో అడుగుపెట్టి అటుగా అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హీట్‌ ఊపందుకుంది. పార్టీలన్నీ తమ అస్త్రాలను సిద్ధం చేసుకుని గెలుపు కోసం కృషి చేస్తున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ తన వారాహితో ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు పయనమయ్యారు.

పవన్ కళ్యాణ్‌కు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్ ఉంది. ఆయనకి ఉండే మాస్ ఫాలోయింగ్ తెలుగు ఇండస్ట్రీలో మరే హీరోకి లేదు అనడంలో ఎటువంటి సందేహం లేదు. రీల్ లైఫ్‌లోనే కాక రియల్ లైఫ్‌లో కూడా హీరో అనిపించుకున్న వ్యక్తి పవన్. ఎంతోమందికి అడిగిన వారికి లేదనకుండా సహాయం చేసి గొప్ప మనసును చాటుకున్నారు పవన్ కళ్యాణ్. అందుకే ఆయనకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది. ఇక పవన్ దేవుడంటూ పచ్చబొట్లు పొడిపించుకున్నవారు కూడా ఉన్నారు.

రాజకీయ నాయకుడిగా జనసేన అనే పార్టీను ప్రారంభించిన ఆయన అధికారంలోకి రాకపోయినప్పటికీ ఎంతోమంది రైతులకు అండగా నిలిచారు. అయితే ఈ వారాహ విజయ యాత్ర ప్రారంభానికి ముందు మంగళగిరిలో చోటు చేసుకున్న ఒక సంఘటన అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.ఈ కార్యక్రమంలో టాలీవుడ్‌కు చెందిన డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు పాల్గొన్నారు. వారిలో డైరెక్టర్ హరీష్ శంకర్, మైత్రీ మూవీస్ సంస్థ నిర్మాత అయిన వై రవిశంకర్, డివివి దానయ్య, ఏ ఎం రత్నం, BVN ఎస్ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల ఉన్నారు.

వీరంతా అక్కడ చేపట్టిన యాగంలో పాల్గొని ఎన్నికల్లో (Pawan Kalyan) పవన్ కళ్యాణ్ విజయం సాధించాలని ఆకాంక్షించారు. అయితే పవన్ కళ్యాణ్‌కు శుభాకాంక్షలు తెలిపే సమయంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతల్లో ఒకరైన వై రవిశంకర్ పవన్ కళ్యాణ్‌ పాదాలకు నమస్కరించాడు. ఆయన మీద అభిమానంతో కాళ్లు మెుక్కాడు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కొందరు దీనిపై నెగటివ్‌ కామెంట్స్ చేస్తుంటే మరికొందరు మాత్రం పవన్ కళ్యాణ్ దేవుడంటూ ఆ ఫోటోలు వైరల్ చేస్తున్నారు.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus