డాలీ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు సినిమా శుక్రవారం రిలీజ్ అయి వందకోట్ల క్లబ్ లో చేరిపోయింది. ఈ చిత్రం విజయాన్ని ఆస్వాదించకుండానే పవన్ తన నెక్స్ట్ సినిమాని పట్టాలెక్కించనున్నారు. జల్సా, అత్తారింటికి దారేది వంటి సూపర్ హిట్స్ ఇచ్చిన డైరక్టర్ త్రివిక్రమ్ తో మూడో సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ వచ్చేనెల 3 వ తేదీ నుంచి జరగనుంది. “దేవుడే దిగి వచ్చినా..” అనే టైటిల్ అనుకుంటున్న ఈ చిత్రంలో పవన్ రోల్ రివీల్ అయింది. కాటమరాయుడులో పంచెకట్టుతో ఫ్యాక్షన్ లీడర్ గా కనిపించిన పవన్, త్రివిక్రమ్ మూవీలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా నటించనున్నారు.
సూటు బూట్ తో ఆకట్టుకోనున్నారు. ఈ చిత్రం కోసం సాఫ్ట్ వేర్ కంపెనీ సెట్ వేయగా.. దానిలో పవన్ కళ్యాణ్ కొన్ని మార్పులు చెప్పారని తెలిసింది. ఆ సెట్లో మార్పులు చేయడానికి టైమ్ పడుతుంది కాబట్టి.. ఫైట్ సీక్వెన్స్ లు షూట్ చేయడానికి త్రివిక్రమ్ డిసైడ్ అయ్యారు. విజయన్ మాస్టర్ కంపోజింగ్ లో పవన్ ఫైట్ సీక్వెన్సులు ముందుగా తెరకెక్కించనున్నారు. హారిక హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మించే ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించనుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.