టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన పవన్ కళ్యాణ్ సుజీత్ డైరెక్షన్ లో డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఒక సినిమాలో నటిస్తున్నట్టు అధికారిక ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హరిహర వీరమల్లు షూట్ తో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఈ సినిమా పూర్తైన తర్వాత సుజీత్ డైరెక్షన్ లో నటించే ఛాన్స్ అయితే ఉంది. ఈ సినిమాకు పవన్ 60 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం.
అయితే తాజాగా పవన్ కళ్యాణ్ ఛార్టెడ్ అకౌంటెంట్స్ విద్యార్థుల సమావేశంలో ప్రసంగించగా పవన్ చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ ను చూసిన వెంటనే స్టూడెంట్స్ సీఎం పవర్ స్టార్ సీఎం పవర్ స్టార్ అంటూ నినాదాలు చేశారు. తాను పాలిటిక్స్ లో ఫెయిల్ అయ్యానని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ఓటముల గురించి నిర్భయంగా మాట్లాడతానని పవన్ తెలిపారు. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దని ఈరోజు ఫెయిల్యూర్ రేపటి సక్సెస్ కు పునాది అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
2019 ఎన్నికల్లో తాను రాజకీయాలలో ఫెయిల్ అయ్యానే తప్ప ఓడిపోలేదని పవన్ కామెంట్లు చేశారు. ఫెయిల్యూర్స్ ను కూడా తాను పాజిటివ్ గానే చూస్తానని పవన్ పేర్కొన్నారు. సమాజంలో మార్పు కోసం తాను ప్రయత్నించానని ఆయన తెలిపారు. సీఏ కష్టమని తనకు తెలుసని పరీక్షల్లో ఫెయిల్ అయినా కష్టపడి ముందడుగులు వేయాలని పవన్ కళ్యాణ్ సూచనలు చేశారు.
ఓటమిని ఒప్పుకోవడం కూడా గొప్పదనమే అని ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గ్రేట్ అని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. పవన్ నటిస్తున్న హరిహర వీరమల్లు సమ్మర్ టార్గెట్ గా షూటింగ్ జరుపుకుంటుండగా ఆ సమయానికి ఈ సినిమా షూట్ పూర్తవుతుందో లేదో చూడాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ సినిమాలకు రికార్డ్ రేంజ్ లో బిజినెస్ జరుగుతుండటంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు.
హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!
ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!