Pawan Kalyan: ఫ్యాన్స్‌ కోట్ల ప్రశ్నలకు పవన్‌ కల్యాణ్‌ సింగిల్‌ ఆన్సర్‌.. ఏమన్నాడంటే

డిప్యూటీ సీఎం అయ్యాక పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan)  సినిమాలకు దూరమవుతారు అని వార్తలొచ్చాయి. ఇక నటించరు అని కొందరు, సినిమాలు తగ్గిస్తారని కొందరు, ఉన్నవి చేసి ఇక ఆపేస్తారని మరికొందరు మాట్లాడుకుంటూ వస్తున్నారు. దీంతో కోట్లాదిమంది అభిమానుల నుండి ప్రశ్నలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ ప్రశ్నలన్నింటికీ పవన్‌ కల్యాణ్ సమాధానమిచ్చాడు. సింగిల్‌ ఆన్సర్‌తో మొత్తం ప్రశ్నలకు ఆన్సర్‌లు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రిగా ప్రజలకు సేవ చేస్తూనే మరోవైపు అంగీకరించిన సినిమాల్లో నటిస్తున్నారు పవన్‌ కల్యాణ్‌.

Pawan Kalyan

రెండు పడవల ప్రయాణం చేస్తున్న ఆయన ఓ తమిళ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమాల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మాట్లాడారు. తనకు డబ్బు అవసరం ఉన్నంతవరకూ సినిమాల్లో నటిస్తూనే ఉంటా అని చెప్పారు. దీంతో పవన్‌ సినిమా కెరీర్‌ విషయంలో క్లారిటీ వచ్చినట్లు అయింది. యోగులు, సిద్ధులను చూసి స్ఫూర్తి పొందుతూ ఉంటాను. నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయడం కోసమే రాజకీయాల్లోకి వచ్చాను. ఎప్పుడూ అదే ఆలోచనలో ఉంటాను కూడా.

నేను ఇప్పటివరకు పెద్దగా సంపద కూడబెట్టుకోలేదు. అలాగే సినిమా నిర్మాణ రంగంలోనూ సీరియస్‌గా భాగం కాను. ఎలాంటి ఇతర వ్యాపారాలు లేవు. నాకు ఉన్న ఆదాయ మార్గం నటన మాత్రమే అని క్లారిటీ ఇచ్చాడు పవన్‌. ఇక సినిమాలు కంటిన్యూ చేస్తారా అనే ప్రశ్నకు.. నాకు డబ్బులు అవసరం ఉన్నంతవరకూ సినిమాల్లో నటిస్తూనే ఉంటాను. అయితే పరిపాలనకు, రాజకీయ జీవితానికి ఎలాంటి ఆటంకం కలగకుండా నటిస్తాను అని పవన్‌ చెప్పుకొచ్చాడు.

పవన్‌ సినిమాల సంగతి చూస్తే.. ‘హరి హర వీరమల్లు’లో నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా డబ్బింగ్‌ పనులు మొదలయ్యాయి. సుజిత్ (Sujeeth) దర్శకత్వంలో ‘ఓజీ’ (OG Movie)  హోల్డ్‌గా ఉండగా.. హరిశ్‌ శంకర్ (Harish Shankar) ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’లో  (Ustaad Bhagat Singh) పరిస్థితీ అదే. ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) లెక్క తేలాకే ఈ రెండు సినిమాలపై దృష్టి పెట్టాలని పవన్‌ కల్యాణ్‌ అనుకుంటున్నారట. త్వరలోనే వీటి విషయంలో ఇంకాస్త క్లారిటీ వస్తుంది.

కింగ్‌డమ్ లో ఆ దేశంతో ఓ ట్విస్ట్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus