కాటమరాయుడు తర్వాతి సినిమాకు పరిశీలనలో హిందీ పేరు!

పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగుతో పాటు హిందీ చిత్రాలను ఇష్టంగా చూస్తుంటారు. అందుకే ఆ భాష ప్రభావం ఆయనలో ఎక్కువగా కనిపిస్తుంది. ఖుషి, జల్సా, తీన్ మార్, గబ్బర్ సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్ .. ఈ పేర్లను గమనిస్తే ఆ విషయం స్పష్టంగా తెలుస్తుంది. ప్రస్తుతం డాలీ దర్శకత్వంలో నటిస్తున్నకాటమరాయుడు తర్వాతి చేయనున్న ప్రాజక్ట్ కి కూడా హిందీ పేరునే పెట్టనున్నట్లు తెలిసింది.

తమిళ దర్శకుడు నీశన్, పవన్ కాంబినేషన్లో వస్తున్న సినిమాను ఏ.ఎం.రత్నం నిర్మిస్తున్నారు. ఈ నిర్మాత పవర్ స్టార్ తో చేసిన సినిమా ఖుషి అప్పట్లో సంచలనం సృష్టించింది. అదే సెంటిమెంట్ కొనసాగాలని ఈ చిత్రానికి హిందీ పేరుని  ఏ.ఎం.రత్నం పవన్ కి సూచించడం, అయన ఒకే చెప్పడం కూడా జరిగిపోయాయట.

ఫిలిం ఛాంబర్లో ఆ పేరుని ఎవరూ రిజిస్టర్ చేయకుండా ఉంటే దానినే ఫిక్స్ చేయనున్నట్లు సమాచారం. అంతవరకు ఆపేరు బయటికి రాకుండా నిర్మాత చాలా జాగ్రత్త పడుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus