పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ ల కొడుకు అఖిరాకు వారం రోజుల క్రితం యాక్సిడెంట్ జరిగింది. సైకిల్ ఫై వెలుతుండగా చైన్ స్టక్ అయి కార్ కి గుద్దుకుని కింద పడ్డాడు. కాలికి, చేతికి, మొహానికి దెబ్బలు తగిలాయి. అప్పటి నుంచి అఖిరా ఆరోగ్యం గురించి రేణు దేశాయ్ ట్విట్టర్ లో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంది. పవన్ అభిమానులు బాబు త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. అఖిరా ఎలా ఉన్నాడో చూడాలని, బాబు ఫోటో పెట్టమని రేణును అడిగారు. “మీ అందరి బ్లెసింగ్ తో అఖిరాకు దెబ్బలు చాలా వరకు తగ్గాయి. పూర్తిగా కోలుకోవడానికి మూడు వారాలు పడుతుంది. ప్రస్తుతం బాబు ఎడమ కన్ను వాచి ఉంది. అందు వల్ల ఫోటో పెట్టలేక పోతున్నాను” అని రేణు దేశాయ్ చెప్పింది. ఇంతకీ పవన్ కళ్యాణ్ కొడుకును చూడ్డానికి వచ్చాడో లేదో ఆమె చెప్పలేదు.
వారం రోజుల క్రితం పేద అమ్మాయి చదువుకు సాయం చేయమని రేణు కోరగానే పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించి, ఆమె స్టడీ కి కావలసిన ఆర్ధిక సాయం చేసాడు. దీంతో పవన్ అభిమానులంతా ఆనందించారు. రేణు దేశాయ్ కి పవన్ కళ్యాణ్ టచ్లో ఉన్నాడని అనుకున్నారు. “అఖిరాకు ప్రమాదం జరిగితే చూడ్డానికి వెళ్లలేదు. ఇతరుల పిల్లల మీద చూపిన ప్రేమ సొంత బిడ్దల పైన ఏమైందని” కొందరు పవన్ ను విమర్శిస్తున్నారు.