Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ కొత్త సినిమా మొదలు.. ఆ విషయం మాత్రం అడగొద్దు!

పవన్ వరుస సినిమాలు అనౌన్స్‌ చేస్తున్నాడు, ముహూర్తాలు కూడా జరుగుతున్నాయి. దీంతో అభిమానులు చాలా ఆనందంగా ఉన్నారు. ఈ ఆనందానికి మరో సినిమా యాడ్‌ అవుతోంది. అంటే మరో సినిమా ముహూర్తం జరుపుకోబోతోంది. ఇప్పటికే అనౌన్స్‌ చేసిన సుజీత్‌ – డీవీవీ దానయ్య సినిమా ముహూర్తపు షాట్‌కు టైమ్‌ అండ్‌ డేట్‌ ఫిక్స్‌ చేశారు అని అంటున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ నెల 30న సినిమాకు కొబ్బరికాయ కొడతారట.

పవన్‌ కల్యాణ్‌ సినిమాలు అనౌన్స్‌ అవుతాయి, ముహూర్తం అవుతుంది, పూజ జరుపుకుంటుంది.. ఇవన్నీ ఓకే రిలీజ్‌ సంగతి అంటే మాత్రం అడగొద్దు అంటుంటుంది అతని టీమ్‌. ఈ నేపథ్యంలో కొత్త సినిమా ప్రారంభం అంటే.. చిన్న డౌట్‌ రాక మానదు. అదే సినిమా రిలీజ్‌ ఎప్పుడు అని. ఛస్‌ ఊరుకోండి.. ఇంకా మొదలుకాకుండానే రిలీజ్‌ ఎప్పుడు అని అంటారా? ఏం చేస్తాం పవన్‌ సినిమా కోసం ఫ్యాన్స్‌ అలా వెయిట్‌ చేస్తున్నారు. పవన్‌ నుండి సరైన మాస్‌ సినిమా పడాలి అనేది వాళ్ల కోరిక.

ఈ క్రమంలో ‘OG’ – ఒరిజినల్‌ గ్యాంగ్‌స్టర్‌ అంటూ డీవీవీ దానయ్య – సుజీత్‌ సినిమా ఆ మధ్య ప్రకటించారు. అయితే ఆ తర్వాత ఎలాంటి ఊసూ లేదు. మధ్యలో ఆర్టిస్ట్‌లు కావాలి అంటూ ఓ ప్రకటన కనిపించింది. అయితే ఇప్పుడు పనులు ఓ కొలిక్కి వచ్చాయి అంటున్నారు. దీంతో సినిమా ముహూర్తపు షాట్‌ తీయడానికి రెడీ అవుతున్నారట. సోమవారం నాడు ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించాలని చూస్తున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు మొదలుపెట్టారట.

ఈ సినిమాలో పవన్‌ కల్యాణ్‌ గ్యాంగ్‌స్టర్‌ పాత్రలో కనిపిస్తాడు. జపాన్‌, ముంబయి నేపథ్యంలో ఈ సినిమా కథ సాగే అవకాశం ఉంది. ఈ సినిమా కోసం సుమారు రూ.100 కోట్ల బడ్జెట్‌ అనుకుంటున్నారట. అలాగే ‘వినోదాయ చిత్తాం’ రీమేక్‌ ముహూర్తం కూడా త్వరలోనే ఉండొచ్చు అని టాక్‌. ఇప్పటికే ‘హరి హర వీరమల్లు’ సెట్స్‌ మీద ఉండగా.. ఇటీవల ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ముహూర్తం జరిగిన విషయం తెలిసిందే.

హంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పఠాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

సౌందర్య టు శృతి హాసన్.. సంక్రాంతికి రెండేసి సినిమాలతో పలకరించిన హీరోయిన్ల లిస్ట్..!
అతి తక్కువ రోజుల్లో వంద కోట్లు కొల్లగొట్టిన 10 తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus