జిమ్ లో కసరత్తులు చేస్తోన్న పవర్ స్టార్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సన్నబడే ప్రయత్నం చేస్తున్నారట. దీనికోసం ఆయన గంటల తరబడి జిమ్ లో కసరత్తులు చేస్తున్నారని సమాచారం. ఇటీవల ‘వకీల్ సాబ్’ సినిమాను పూర్తి చేసిన పవన్ ప్రస్తుతం మలయాళ సినిమా ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ రీమేక్ ను మొదలుపెట్టారు. సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో పవన్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ గెటప్ కోసం పవన్ కసరత్తులు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొంతబరువు తగ్గారని.. ఇంకా తగ్గే ప్రయత్నంలో ఉన్నారని చెబుతున్నారు.

అయితే ఈ గెటప్ కి సంబంధించి ఏమైనా ఫోటోలు లీక్ అవుతాయేమోనని చిత్రబృందం చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ముఖ్యంగా పోలీస్ యూనిఫామ్ లో పవన్ లుక్ లీక్ కాకుండా చూసుకుంటున్నారు. పవన్ గనుక ఆ గెటప్ లో సెట్ లోకి వచ్చిన వారితో ఫోటోలు దిగితే క్రేజ్ మొత్తం పోతుందని టెన్షన్ పడుతున్నారు. ఈ విషయం పవన్ తో కూడా మాట్లాడి మరింత కేర్ తీసుకోవాలనుకుంటున్నారు.

కానీ జనసైనికులు వచ్చి ఫోటోలు దిగుతామంటే పవన్ నో చెప్తారో లేదో చూడాలి. గతంలో పవన్ జిమ్ కోసం బెంగుళూరు వెళ్లేవారు. కానీ ఇప్పుడు రాజకీయాలు, సినిమాలతో బిజీగా ఉండడంతో హైదరాబాద్ లోనే ఉండాల్సి వస్తోంది. దీంతో సమయం కేటాయించుకొని రోజూ జిమ్ కి వెళ్లి సన్నబడే ప్రయత్నంలో ఉన్నారు. ఈ సినిమాలో పవన్ తో పాటు రానా కూడా నటిస్తున్నాడు. అలానే ఐశ్వర్యా రాజేష్, సాయి పల్లవి హీరోయిన్లుగా కనిపించబోతున్నారు.


ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus