Pawan Kalyan: సినిమాల షూటింగ్‌పై పవన్‌ క్లారిటీ ఇచ్చాడా..!

పవన్‌ కల్యాణ్‌ కొత్త సినిమా ఎప్పడు అనే మాటకు సమాధానం… అన్నీ అనుకున్నట్లుగా సాగితే ఫిబ్రవరి 25 అని చెప్పొచ్చు. మరి సినిమా షూటింగ్‌లకు ముహూర్తం ఎప్పుడు అంటే ఎమో ఇంకా ఓ నిర్ణయానికి రాలేదనే చెప్పాలి. ప్రస్తుతం టాలీవుడ్‌ ఈ అంశం మీదే చర్చ నడుస్తోంది. నిజానికి వపన్‌ ఫారిన్‌ టూర్‌ అయ్యాక సినిమాల షూటింగ్‌ మొదలవుతుంది అని టాక్‌ వినిపించింది. కటుంబంతో గడపడానికి పవన్‌ ఇటీవల రష్యా వెళ్లి వచ్చారు. దీంతో సినిమాలు ఇక మొదలు అని అనుకున్నారు.

కానీ పరిస్థితి చూస్తే అలా కనిపించడం లేదు అంటున్నారు టాలీవుడ్‌ పరిశీలకులు. కారణం కరోనా పరిస్థితులే అని చెబుతున్నారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతుండటం, టాలీవుడ్‌లోనూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో అంతమందితో సినిమా షూటింగ్‌లు పెట్టడం ఇబ్బందికరమని పవన్‌ కల్యాణ్‌ భావిస్తున్నారట. అందుకే కరోనా పరిస్థితులు అన్నీ సద్దుమణిగాకే సినిమా సెట్స్‌కు వెళ్లాలని పవన్‌ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అంటే ఈ లెక్కన మరో రెండు, మూడు నెలలు పవన్‌ సినిమాల షూటింగ్‌ ఉండదనుకోవచ్చు.

ప్రస్తుతం పవన్‌ చేతిలో వరుస సినిమాలున్నాయి. ‘భీమ్లా నాయక్‌’ చివరిదశకొచ్చింది. ఇంకొన్ని సీన్స్‌ తీస్తే సినిమా విడుదలకు రెడీ చేయొచ్చని టీమ్‌ చూస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే ఈ పాటికి సినిమా రెడీ అయపోయేదే. రిలీజ్‌ డేట్‌ మారే సరికి పని ఆలస్యం చేసినట్లున్నారు. దీని తర్వాత పవన్‌ ‘హరి హర వీరమల్లు’ సినిమా మొదలుపెడతారు. ఆ మధ్య పవన్‌ను ఆ సినిమా దర్శకుడు క్రిష్‌ కలిసి ప్లాన్స్‌ కూడా చర్చించుకున్నారు.

ఆ రెండు సినిమాల తర్వాత పవన్‌ మరో రెండు సినిమాలు ఓకే చేశాడు. అందులో ఒకటి మైత్రీ మూవీ మేకర్స్‌ – హరీశ్‌ శంకర్‌ సినిమా. ‘భవదీయుడు భగత్‌ సింగ్‌’ గా టైటిల్‌ నిర్ణయించి పోస్టర్‌ కూడా లాంచ్‌ చేశారు. ఈ సినిమా తర్వాత రామ్‌ తాళ్లూరి – సురేందర్‌ రెడ్డి సినిమా ఉంటుంది. ఇవి కాకుండా భగవాన్‌ – దానయ్య, దిల్‌ రాజులకు సినిమా చేస్తానని పవన్‌ మాటిచ్చాడని అంటున్నారు. మరిందులో ఏది ముందుకొస్తుందో చూడాలి.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus