న్యూస్ ఛానల్ పెడుతున్న పవన్..?
- April 22, 2016 / 01:27 PM ISTByFilmy Focus
సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మరో రెండు మూడు చిత్రాల్లో నటించిన తరువాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నట్లు, 2019 ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని ఆయన ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలలో తెలిపాడు.
తాజా సమాచారం ప్రకారం ఆయన సొంతంగా ఓ న్యూస్ ఛానల్ ను ప్రారంభించనున్నారనే వార్త ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతోంది. జనసేన పార్టీని, పార్టీ సిద్దాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళేందుకు ఆయన న్యూస్ ఛానల్ తో పాటు, ఓ న్యూస్ పేపర్ ను కూడా ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారని టాక్.
అయితే వీటన్నింటి కంటే ముందుగా ఓ యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించలనే ఆలోచనలో పవన్ ఉన్నారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఇప్పటికే పలు ప్రాంతాల్లో జనసేన పార్టీ విస్తరణకు సంబంధించిన గ్రౌండ్ వర్క్ ప్రారంభించారని, నియోజకవర్గాల వారీగా నేతల ఎంపికలు జరుగుతున్నాయనే వార్తలు వినవస్తున్నాయి.

















