పవన్, త్రివిక్రమ్ మూవీ ఈ ఏడాదే వస్తోంది
- June 15, 2017 / 01:12 PM ISTByFilmy Focus
డైరక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న మూడవ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్ లో కొన్ని రోజుల క్రితం హీరో పవన్, హీరోయిన్లు అను ఇమ్మానియేల్, కీర్తి సురేష్ లపై రొమాంటిక్ సన్నివేశాలను షూట్ చేశారు. ప్రస్తుతం యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. నాన్ స్టాప్ గా షూటింగ్ పూర్తిచేసి, ఈ సినిమాని దసరాకి రిలీజ్ చేయాలనీ నిర్మాత రాధాకృష్ణ మొదట్లో అనుకున్నారు. కానీ సెప్టెంబర్ లో ఎన్టీఆర్, మహేష్, బాలకృష్ణ సినిమాలు వస్తుండడంతో కలక్షన్స్ పై ప్రభావం చూపిస్తుందని వాయిదా వేసుకున్నారు.
వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేద్దామని డిసైడ్ అయ్యారు. కానీ అభిమానులు ఒత్తిడి చేయడంతో ఈ ఏడాదే రిలీజ్ చేయడానికి ఫిక్స్ అయ్యారు. అక్టోబర్ 12, 13 తేదీలలో రిలీజ్ చేయాలనీ త్రివిక్రమ్ భావిస్తున్నారు. అయితే దీపావళి (అక్టోబర్ 19 ) కానుకగా పవన్ ఫ్యాన్స్ కి ఈ చిత్రాన్ని గిఫ్ట్ గా ఇవ్వనున్నారన్నమాట.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
















