అప్పటి నుంచి పవన్, త్రివిక్రమ్ సినిమా రెగ్యులర్ షూటింగ్
- March 16, 2017 / 10:09 AM ISTByFilmy Focus
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాయు వేగంతో దూసుకు పోతున్నారు. డాలీ దర్శకత్వంలో కాటమరాయుడు షూటింగ్ పూర్తిచేసిన పవన్, నెక్స్ట్ సినిమా షూటింగ్ కి డేట్ ఫిక్స్ చేశారు. జల్సా, అత్తారింటికి దారేది వంటి సూపర్ హిట్స్ ఇచ్చిన డైరక్టర్ త్రివిక్రమ్ తో సినిమా చేయనున్న సంగతి తెలిసందే. దీనికి పూజా కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి. “దేవుడే దిగి వచ్చినా..” అనే టైటిల్ అనుకుంటున్న ఈ చిత్రానికి ఖుషి సినిమాకు కెమెరామెన్ గా పనిచేసిన ప్రముఖ ఫోటో గ్రాఫర్ పీసీ శ్రీరామ్ ని తీసుకున్నారు. తమిళ సంగీత దర్శకుడు అనిరుద్ పాటలను అందించనున్నారు.
హారిక హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మించే ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించనుంది. సినిమా ప్రకటన దగ్గరినుంచి ఆసక్తి రేకెత్తిస్తోన్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ వచ్చేనెల 3 వ తేదీ నుంచి మొదలుకానుంది. ఈ చిత్రాన్ని మూడు నెలలలో కంప్లీట్ చేయాలని పవన్ భావిస్తున్నారు. అనంతరం తమిళ డైరక్టర్ ఆర్ టీ నేసన్ మూవీని పట్టాలెక్కించనున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















