అన్నయ్య శ్రీ చిరంజీవి గారు సత్వరమే కోలుకోవాలి!

అన్నయ్య శ్రీ చిరంజీవి గారు లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి ఎన్నో జాగ్రత్తలు తీసుకోవడమే కాదు – ప్రతి ఒక్కరిలో చైతన్యం కలిగించారు. సామాజిక బాధ్యతగా పలు సేవా కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నారు. ప్రజారోగ్యంపై ఎంతో అవగాహన ఉన్న అన్నయ్య తన ఆరోగ్యంపట్లా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ క్రమంలో అన్నయ్య శ్రీ చిరంజీవి గారు కరోనా బారినపడటంతో మేమంతా విస్తుపోయాం. ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. పరీక్షల్లో మాత్రం పాజిటివ్ అని తేలింది. అన్నయ్య శ్రీ చిరంజీవి గారు సత్వరమే కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.

కరోనా వైరస్ కు వ్యాక్సిన్ కోసం సాగుతున్న ప్రయోగాలు త్వరగా ఫలవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను. ప్రపంచం అంతా ఆ వ్యాక్సిన్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాయి. మరో వైపు కోవిడ్ సెకండ్ వేవ్ ప్రమాదం ఉందనే వైద్య ఆరోగ్య నిపుణుల హెచ్చరికలు చూస్తున్నాం. జాగ్రత్తలు పాటించడంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాను.

Most Recommended Video

ఈ 15 సినిమాలకి మొదటి ఛాయిస్ ఈ హీరోయిన్లు కాదు.. మరెవరో తెలుసా..!
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!
‘కలర్ ఫోటో’ నుండీ హృదయాన్ని హత్తుకునే 15 డైలాగులు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus