Bro Movie: పవర్ స్టార్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ ఖాయం.. కానీ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయితేజ్ కాంబినేషన్ లో బ్రో సినిమా తెరకెక్కగా మరో వారం రోజుల్లో ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి వస్తున్న వరుస అప్ డేట్స్ సినిమాపై అంచనాలను పెంచగా ఈ సినిమా తాజాగా సెన్సార్ ను పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు యు సర్టిఫికెట్ రాగా పవన్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ అనేలా ఈ సినిమా ఉండనుందని ఫ్యాన్స్ కు నచ్చే అంశాలకు ఈ సినిమాలో పెద్ద పీట వేశారని సమాచారం.

తెలుగు ప్రేక్షకులను కచ్చితంగా మెప్పించేలా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమా స్క్రిప్ట్ లో కీలక మార్పులు చేశారని తెలుస్తోంది. పవన్ మేనరిజమ్స్ సినిమాలో ఉంటాయని పవన్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ వచ్చే సన్నివేశాలకు సినిమాలో కొదువ ఉండదని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఖాతాలో ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ఖాయమని అందుకు సంబంధించి ఎలాంటి సందేహం అవసరం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

బ్రో (Bro Movie) సినిమా కలెక్షన్ల విషయంలో సంచలనాలు సృష్టిస్తుందని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. మరోవైపు ఈ సినిమా నిర్మాత విశ్వ ప్రసాద్ మాట్లాడుతూ బ్రో సినిమాపై రాజకీయ అంశాలు ప్రభావం చూపవని భావిస్తున్నానని పేర్కొన్నారు. లిమిటెడ్ బడ్జెట్ లో సినిమా పూర్తైందని టికెట్ రేట్లను పెంచాలనే ఆలోచన చేయడం లేదని ఆయన చెప్పుకొచ్చారు. పెద్ద సినిమాలకు ప్రీమియర్స్ అక్కర్లేదని విశ్వప్రసాద్ అన్నారు.

ఫ్యాన్స్ నుంచి ఒత్తిడి వస్తే పరిస్థితుల ఆధారంగా ప్రీమియర్స్ విషయంలో నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు. తమ బ్యానర్ లో బ్రో 25వ సినిమా అని బాలీవుడ్ లో కూడా సినిమాలు చేయాలని భావిస్తున్నామని విశ్వ ప్రసాద్ వెల్లడించారు. నైజాంలో మైత్రీ నిర్మాతలు ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. కమర్షియల్ గా ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus