Vakeel Saab: ‘వకీల్ సాబ్’.. పవన్ ఎంట్రీ సీన్ ఇదే!

  • April 3, 2021 / 03:43 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు మూడేళ్ల తరువాత ‘వకీల్ సాబ్’ సినిమాతో రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలీవుడ్ లో భారీ విజయాన్ని అందుకున్న ‘పింక్’ సినిమాకి రీమేక్ గా దీన్ని తెరకెక్కించారు. అయితే పవన్ ఇమేజ్ కి తగ్గట్లుగా ఈ కథలో కీలకమైన మార్పులు చేశారు. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా కమర్షియల్ హంగులను జోడించారు. అందులో ఫైట్స్ చాలా కీలకంగా ఉంటాయని తెలుస్తోంది. ‘పింక్’ సినిమాలో అసలు ఒక్క ఫైట్ కూడా ఉండదు.

కానీ ‘వకీల్ సాబ్’లో మొత్తం ఐదు యాక్షన్ సీక్వెన్సెస్ ను యాడ్ చేసినట్లు తెలుస్తోంది. సినిమా ఫస్ట్ హాఫ్ లో మూడు, సెకండ్ హాఫ్ లో రెండు ఫైట్ సీక్వెన్సెస్ ఉంటాయట. పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ సీన్ ఓ ఫైట్ తో ఉంటుందని తెలుస్తోంది. ఓ ఇంట్లో రౌడీ చేరి సామాన్లన్నీ విసిరేస్తూ ఉంటారట. ఈ క్రమంలో వివేకానందుడి ఫోటో విసిరేస్తున్నప్పుడు ఆ ఫోటోని గాల్లోనే ఓ చేయి వచ్చి పట్టుకుంటుందని.. అది పవన్ కళ్యాణ్ అని సమాచారం.

ఆ తరువాత రౌడీలతో ఫైట్ చేసే సీన్ ను మంచి క్లాసీ లుక్ తో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్ స్టూడెంట్ లీడర్ గా కనిపించనున్నాడని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. నివేదా థామస్, అంజలి, అనన్య లాంటి తారలు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమా ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Most Recommended Video

వైల్డ్ డాగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
సుల్తాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus