లైక్ లు అందుకుంటున్న ఫ్యాన్ మేడ్ కాటమరాయుడు పోస్టర్!
- October 29, 2016 / 11:58 AM ISTByFilmy Focus
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి తెలుగురాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ అంత ఇంతా కాదు. ఆయన సినిమా మొదలయింది అనగానే అది ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా? అని అభిమానులు ఎదురుచూస్తుంటారు. ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ ఏదైనా సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ అవుతుంది.
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం డాలీ దర్శకత్వంలో కాటమరాయుడు సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభం సంధర్బంగా లోగో ను రిలీజ్ చేశారు. ఇప్పటి వరకు అధికారికంగా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయలేదు. దీపావళి సంధర్బంగా ఆ ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేయనున్నట్లు అలా ప్రకటన వచ్చింది లేదో అభిమానులు సొంతంగా పోస్టర్ ని డిజైన్ చేశారు.
సైకిల్ పై పవన్ వస్తున్నఆ పోస్టర్ ఇప్పుడు విపరీతమైన లైకులు అందుకుంటోంది. దీనిని బట్టే అర్ధం చేసుకోవచ్చు పవర్ స్టార్ చిత్రంపై క్రేజ్ ఎలా ఉందోనని. ఫ్యాన్ మేడ్ పోస్టరే ఇంత ఆకట్టుకుంటే.. ఈ రోజు సాయంత్రం 7 గంటలకు రిలీజ్ కానున్న అసలుసిసలైన కాటమరాయుడు ఫస్ట్ పోస్టర్ ఎన్ని రికార్డులు సృష్టించనుందో..!!















