పవన్ కొత్త సినిమా టైటిల్ ఇదేనా..?

పవన్ కళ్యాణ్, ఎస్.జె.సూర్య కాంబినేషన్ లో ఓ సినిమా చేయబోతున్నాడన్న సంగతి తెలిసిందే. ‘సర్దార్’ సినిమా తరువాత పవన్ కొంతకాలం గ్యాప్ తీసుకుంటాడనుకుంటే వెంటనే సినిమా స్టార్ట్ చేస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పనులు మొదలయిపోయాయి. మొదటి పాట రికార్డింగ్ కూడా పూర్తైపోయింది. ఇది ఇలా ఉండగా ఈ సినిమా టైటిల్ ను కన్ఫర్మ్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ తో ‘ఖుషి’ సినిమా చేసిన సూర్య ఈ చిత్రానికి కూడా అదే అర్ధం వచ్చే విధంగా ‘హుషారు’ అనే టైటిల్ అనుకుంటున్నట్లు టాక్. ఈ నెల 29న ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుకను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus