Payal Rajput: అప్పుడు చాలా బాధపడ్డా.. కానీ ఏం చేస్తాం: పాయల్‌

‘మంగళవారం’ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుక రానుంది పాయల్‌ రాజ్‌పూత్‌. ‘ఆర్‌ఎక్స్‌ 100’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ భామ ఓవర్‌ నైట్‌ స్టార్ అయిపోయింది. అయితే ఆ తర్వాత సినిమాల ఎంపిక విషయంలో అనూహ్యంగా గ్రాఫ్‌ కిందకు పడిపోయింది. ఏ సినిమా ముట్టుకున్నా పరాజయమే ఎదురైంది. అయితే ఇప్పుడు మళ్లీ తన కెరీర్‌ను తిరిగి ట్రాక్‌ ఎక్కించేందుకు తొలి సినిమా ఛాన్స్‌ ఇచ్చిన అజయ్‌ భూపతినే నమ్ముకుంది.

ఆ సినిమానే ‘మంగళవారం’. ఈ సినిమా విడుదల సందర్భంగా ఇటీవల ఆమె మీడియాతో తరచుగా మాట్లాడుతూ ఉంది. ఈ క్రమంలో తన ఫస్ట్‌ లవ్‌ గురించి మాట్లాడింది పాయల్‌. హీరో, హీరోయిన్ల ఇష్టాయిష్టాలు, చిన్ననాటి జ్ఞాపకాలు తెలుసుకోవాలని అభిమానులు ఆసక్తి ఉంటుంది. ఈ క్రమంలో లవ్‌ స్టోరీలు ఏవైనా ఉంటే చెప్పండి అంటూ అడుగుతుంటారు కూడా. అలా పాయల్‌ రాజ్‌పుత్‌ను తన ఫస్ట్‌ లవ్‌ గురించి అడిగారు. అప్పుడే ఆసక్తికర సమాధానం వచ్చింది.

స్కూల్‌లో చదువుకునే రోజుల్లో ఓ అబ్బాయిని ప్రేమించాను. అతనిని చూడగానే ఏదో తెలియని ఆనందం కలిగేది. అలా కొన్ని రోజులకు తన దగ్గర నా ప్రేమను వ్యక్తం చేశారు. కానీ అతను నన్ను రిజెక్ట్‌ చేశాడు అని చెప్పింది పాయల్‌. ప్రేమను అంగీకరించలేదనే బాధతో చదువుపై దృష్టి పెట్టలేకపోయాను అని కూడా చెప్పింది. అంతేకాదు దాని వల్ల పరీక్షల్లో కూడా ఫెయిలైందట. ఇదే విషయాన్నిఇ అమ్మకు చెప్పి ఏడ్చేశాను అని చెప్పింది.

‘మంగళవారం’ సినిమా షూటింగ్‌ సమయంలో జరిగిన విషయాన్ని చెబుతూ పాయల్‌ బాధపడింది. ఆ సినిమా సమయంలో తాను కిడ్నీ సమస్యతో బాధపడ్డానని, జీవితంలో కష్టంగా గడిచిన క్షణాలు అవే అని కూడా చెప్పింది. తాను తొలుత ద్రవ పదార్థాలను తక్కువగా తీసుకునేదానినని, దయచేసి నీళ్లు ఎక్కువగా తాగండి అని సూచించింది. ఇక ఈ సినిమా నవంబరు 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో పాయల్‌ (Payal Rajput) తిరిగి తన ట్రాక్‌ ఎక్కుతుందేమో చూడాలి.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus