“మీ టూ” ప్రశ్నకు ఆసక్తికర సంగతి చెప్పిన ఆర్ ఎక్స్ 100 బ్యూటీ!

  • October 19, 2018 / 08:09 AM IST

ప్రస్తుతం భారతీయ చిత్రపరిశ్రమలో  “మీటూ” ఉద్యమం రోజురోజుకి ఉధృతం అవుతోంది. లైంగిక వేధింపుల బారిన పడిన నటీమణులు.. దైర్యంగా ముందుకు వచ్చి తమ అనుభవాన్ని మీడియాతో పంచుకుంటున్నారు. ఇదే విషయాన్ని ఆర్ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్ పుత్ ముందు ఉంచగా.. ఆమె సంచలన కామెంట్స్ చేసింది. ” ఇక్కడ కాస్టింగ్ కౌచ్ ఉన్న మాట వాస్తవమే” అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పింది. ఇంకా రీసెంట్ గా జరిగిన తన అనుభవాన్ని వెల్లడించింది. “ఇటీవలే ఓ సినిమాలో అవకాశం వచ్చింది. ఓ వ్యక్తి నన్ను కలిసి ఈ సినిమాలో అఫర్ ఇస్తే తనకేమి ఇస్తావని అడిగాడు.

దాంతో నేను షాక్  అయ్యా. కాసేపు మాటలు రాలేదు. అతను చెంపలు వాయగొట్టాలన్న కోపం వచ్చింది. కానీ కంట్రోల్ చేసుకున్నా?” అని వివరించింది. అతడు ఎవరనే విషయాన్ని చెప్పకపోయినా.. సదరు వ్యక్తికి గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్లు పాయల్ తెలిపింది. ఆర్ఎక్స్ 100 తర్వాత పాయల్ కొత్త దర్శకుడు భాను శంకర్ దర్శకత్వంలో నటించడానికి ఓకే చెప్పింది. “మిస్టర్ అండ్ మిసెస్ 420 రిటర్న్స్” అనే పంజాబీ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాలు హిట్ అయితే స్టార్ హీరోయిన్స్ జాబితాలో చేరిపోవడం ఖాయమని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus