పాయల్ రాజ్ పుత్ లాంచ్ చేసిన ‘సౌండ్(మల్టీ బ్రాండ్)’ మూవీ టైటిల్ లోగో 

  • November 1, 2021 / 12:59 PM IST

శ్రీ సాయి వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ (SSVCC) పతాకం పై ప్రొడక్షన్ నెం1 సినిమా టైటిల్ లోగోను తాజాగా ‘ఆర్.ఎక్స్.100’ హీరోయిన్ బ్యూటిఫుల్ పాయల్ రాజ్ పుత్ లాంచ్ చేశారు. అందరూ కొత్త వాళ్ళతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘సౌండ్’ అనే టైటిల్ ఖరారు చేశారు. మల్టీ బ్రాండ్ అనేది దీనికి క్యాప్షన్. తన సోషల్ మీడియా ఖాతా ద్వారా టైటిల్ లోగోని పాయల్ రివీల్ చేయడంతో పాటు చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ కూడా చెప్పారు.

ఈ సందర్భంగా ‘సౌండ్’ చిత్రం  దర్శకుడు అయిన కేవీ చౌదరి మాట్లాడుతూ “మన జీవితంలో ‘సౌండ్’ అనేది చాలా కామన్ వర్డ్.  క్యాచీగా ఉంటుందని ఆ టైటిల్ ను పెట్టడం జరిగింది. సినిమాలో ఎంటర్టైన్ మెంట్ కు పెద్ద పీట వేసాం. కథాంశం కూడా అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం ద్వారా కొత్త నటీనటుల్ని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాం. ఇటివల నిర్వహించిన ఆడిషన్ లో పాల్గొన్న వారిలో ట్యాలెంట్ కలిగిన ఎంతోమందిని ఎంపిక చేసుకున్నాం. హీరో -హీరోయిన్ల వివరాలను త్వరలోనే ప్రకటిస్తాం. అలాగే మా సినిమాకి ఎక్స్ పీరియన్స్ ఉన్న టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు.” అంటూ తెలియజేసారు.

నిర్మాత అయిన కె. రవీంద్ర మాట్లాడుతూ “మా దర్శకుడు చాలా మంచి కథతో ఈ సినిమాను తెరకెక్కించడానికి ముందుకొచ్చారు. ఏ సినిమాకయినా టైటిల్ అనేది కీలక పాత్ర పోషిస్తుంది. అది జనాల్లోకి వెళితే చాలు సినిమా సగం సక్సెస్ అయినట్టే. అందుకే చేరువయ్యేలా ఈ టైటిల్ పెట్టాం. మా ‘సౌండ్’ టైటిల్ అందరికీ నచ్చుతుందని ఆకాంక్షిస్తున్నాను. నవంబర్ మూడో వారం నుండీ షూటింగ్ ప్రారంభించబోతున్నాం. అందరి ఆశీస్సులు మా బ్యానర్ కు అలాగే సినిమాకి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.” అంటూ చెప్పుకొచ్చారు.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus