రెండు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పాయల్ రాజ్ పుత్

యువ దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన “ఆర్‌ఎక్స్ 100” సినిమా సంచలన విజయం సాధించింది. బడ్జెట్ ని రెండురోజుల్లో రాబట్టిన ఈ సినిమా 20 కోట్లను వసూలు చేసింది. ఈ సినిమా ఘనవిజయం సాధించడంలో పాయల్ రాజ్ పుత్ భాగం ఎక్కువని సినీ విశ్లేషకులు తేల్చేశారు. ఆమె రొమాన్స్, పెర్ఫార్మెన్స్ అదిరిపోయాయని కితాబు ఇచ్చారు. దాంతో పాయల్ రాజ్ పుత్ డేట్స్ కోసం చాలామంది దర్శక నిర్మాతలు ఎదురుచూస్తున్నారు. అనేక కథలు విన్న పాయల్ తాజాగా రెండు సినిమాలకు సైన్ చేసినట్లు తెలిసింది. భాను శంకర్ చూపిన కథ, తన రోల్ నచ్చడంతో ఒకే చెప్పినట్లు తెలిసింది.

ఆర్ఎక్స్ 100 లో తన పాత్రకు పూర్తిగా భిన్నంగా ఉండే పాత్రలో ఈ సారి పాయల్ కనిపిస్తుందని సమాచారం. యాక్షన్ సన్నివేశాల్లోను నటించనున్నట్లు టాక్. ఈ మూవీ ఈ నెలలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. దీని తర్వాత ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ నిర్మించబోయే సినిమాలో నటించడానికి ఓకే చెప్పినట్లు తెలిసింది. ఇందులో హీరో నందమూరి బాలకృష్ణ అని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ చేస్తున్నారు. ఈ మూవీ సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఆ తర్వాత కళ్యాణ్ మూవీ పట్టాలెక్కనుంది. ఈ రెండు హిట్ అయితే పాయల్ తెలుగు టాప్ హీరోయిన్స్ కి గట్టి పోటీ ఇస్తుందనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus