Peddha Kapu: పెయిడ్ ప్రీమియర్స్ కి రెడీ అయిన ‘పెదకాపు 1’ టీం..!

  • September 27, 2023 / 09:15 AM IST

ఈ మధ్య కాలంలో ఒక సినిమా రిలీజ్ రోజుకి కొన్ని గంటల ముందు ఓవర్సీస్ లో షోలు పడటమే పెద్ద రిస్క్ అని కొంతమంది నిర్మాతలు భావిస్తున్నారు. ఎందుకంటే ఆ సినిమా ఫలితం.. ఓవర్సీస్ షోలతోనే తెలిసిపోతుంది. అలాంటిది తెలుగు రాష్ట్రాల్లోనే రిలీజ్ కి కొన్ని గంటల ముందు ప్రీమియర్స్ వేయడం అంటే.. మామూలు రిస్క్ అవుతుందా. అయినా సరే ఈ రిస్క్ చేసి కొన్ని సినిమాలు సక్సెస్ సాధించాయి.

‘సామజవరగమన’ ‘బేబీ’ వంటి సినిమాలకి రిలీజ్ రోజుకు కొన్ని గంటల ముందే పెయిడ్ ప్రీమియర్స్ వేసుకున్నారు మేకర్స్. ఆ సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అలాగే ‘బెదురులంక 2012 ‘ అనే సినిమా కూడా సక్సెస్ అయ్యింది. ‘ఉస్తాద్’ వంటి సినిమాకి మాత్రం అది వర్కౌట్ అవ్వలేదు. అయితే ఇప్పుడు ‘పెదకాపు 1 ‘ చిత్రానికి కూడా పెయిడ్ ప్రీమియర్స్ వేయబోతున్నారట. అవును తెలుగు రాష్ట్రాల్లో సెప్టెంబర్ 28 న ‘పెదకాపు 1 ‘ పెయిడ్ ప్రీమియర్స్ వేయడానికి దర్శకనిర్మాతలు రెడీ అయ్యారు.

ఇది పూర్తిగా రిస్కీ డెసిషన్. అసలే కొత్త హీరో.. పైగా ఇంకో పక్కన బోయపాటి వంటి స్టార్ డైరెక్టర్ తెరకెక్కించిన ‘స్కంద’ కూడా రిలీజ్ కాబోతుంది. ఇలాంటి టైంలో టాక్ ఏమాత్రం నెగిటివ్ గా వచ్చినా.. ఈ సినిమా ఓపెనింగ్స్ దెబ్బతినడమే కాకుండా మొదటికే సినిమాని చంపేసినట్టు అవుతుంది. అయినా సరే కంటెంట్ పై ఉన్న నమ్మకంగా ‘పెదకాపు 1 ‘ (Peddha Kapu) మేకర్స్ ఈ డెసిషన్ తీసుకున్నట్టు స్పష్టమవుతుంది.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus