శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ‘పెద కాపు -1 ‘ అనే సినిమా రూపొందింది. ‘అఖండ’ వంటి బ్లాక్ బస్టర్ ను అందించిన మిర్యాల రవీందర్ రెడ్డి.. ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. ఆయన బావమరిది విరాట్ కర్ణ ఈ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ప్రగతి శ్రీవాత్సవ హీరోయిన్. టీజర్, ట్రైలర్ లు డిఫరెంట్ గా ఉన్నాయి. సెప్టెంబర్ 29 న ఈ సినిమా విడుదల కాబోతుంది. అంతాబాగానే ఉంది కానీ.. ఈ సినిమా టైటిల్ పై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే సెన్సార్ వారు మాత్రం ఈ టైటిల్ పై అభ్యంతరం తెలిపింది అంటూ ఏమీ లేదు. కానీ కొంతమంది మాత్రం కులాల ప్రస్తావన తీసుకొచ్చి గొడవలు పెట్టేందుకు సినిమా యూనిట్ వ్యవహరిస్తున్నట్లు మూవీ టీం పై ప్రశ్నల వర్షం కురిపించారు. వాస్తవానికి ముందుగా ఈ సినిమా టైటిల్ కర్ణ అని అనుకున్నారు అని నిర్మాత చెప్పాడు. కానీ అది ఫైనల్ అయితే చేయలేదని ఆయన చెప్పారు.
ఫైనల్ చేద్దాము అనుకుంటున్న టైంలో శ్రీకాంత అడ్డాల ఆంధ్రప్రదేశ్ లోని గోదావరి జిల్లాల్లో ఓ చోట ‘పెదకాపు గారి జ్ఞాపకార్థం’ అని రాసి ఉండటం చూసి నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డికి ఫోన్ చేసి చెప్పారట. అప్పుడు ఈ పేరుని ఫిక్స్ చేసినట్టు మిర్యాల రవీందర్ రెడ్డి చెప్పుకొచ్చారు. సో డైరెక్టర్ కి, డబ్బులు పెట్టిన నిర్మాతకి, అలాగే సెన్సార్ సభ్యులకి లేని అభ్యంతరం మిగిలిన వారికి అవసరం లేదు అనే చెప్పొచ్చు.
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!