Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్
- June 4, 2026 / 02:04 PM ISTByPhani Kumar
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్ గా ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పెద్ది'(Peddi). ఇదొక పీరియాడిక్ స్పొర్ట్స్ డ్రామా. ‘వ్రిద్ది సినిమాస్’ బ్యానర్ పై వెంకట్ సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మించగా సుకుమార్, నవీన్ యెర్నేని, వై.రవి శంకర్..లు సమర్పకులుగా వ్యవహరించారు. జూన్ 4న విడుదల కానుంది ఈ చిత్రం.
Peddi

ప్రమోషన్స్ లో భాగంగా విడుదల చేసిన.. పాటలు, గ్లింప్స్ వంటి వాటికి సూపర్ రెస్పాన్స్ లభించింది. ‘చికిరి చికిరి’ పాట అయితే యూట్యూబ్లో వందల కొద్దీ మిలియన్ల వ్యూస్ ను కొల్లగొట్టింది. ట్రైలర్ కూడా మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అందుకే ఈ సినిమాకి భారీ ధియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఒకసారి వాటి వివరాలు అలాగే బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్ ను ఓ లుక్కేద్దాం రండి :
| నైజాం | 50 cr |
| సీడెడ్ | 25 cr |
| ఉత్తరాంధ్ర | 19 cr |
| ఈస్ట్ | 10 cr |
| వెస్ట్ | 8 cr |
| గుంటూరు | 11 cr |
| కృష్ణా | 9 cr |
| నెల్లూరు | 6 cr |
| ఏపీ + తెలంగాణ (టోటల్) | 138 cr |
| కర్నాటక + తమిళ్+ హిందీ+ కేరళ | 50 cr |
| ఓవర్సీస్ | 35 cr |
| వరల్డ్ వైడ్ (టోటల్) | 223 cr |
‘పెద్ది’ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా రూ.223 కోట్ల ధియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.225 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. సినిమాపై మంచి హైప్ ఉంది కాబట్టి.. ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా.. బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి.
‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ












