కీర్తి విషయంలో.. మహేష్ ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడుతున్నారు..!

జూన్ 19న కీర్తి సురేష్ నటించిన ‘పెంగ్విన్’ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేశారు. ఈశ్వ‌ర్ కార్తీక్‌ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం డైరెక్ట్ ఓటిటిలో విడుదలయ్యింది కాబట్టి ఎక్కువ మందే చూసారని చెప్పాలి. కార్తీక్ సుబ్బరాజు, కార్తికేయన్ సంతానం, సుధన్ సుందరం,జయరాం వంటి నిర్మాతలు 7.5కోట్లకు ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ కు అమ్మారు. ‘పెంగ్విన్’ ను లో- బడ్జెట్ లోనే తెరకెక్కించారు కాబట్టి సేఫ్ అయిపోయారు. అమెజాన్ వారు కూడా ఈ చిత్రం వల్ల లాభాలు పొందే అవకాశం ఉందట.

పెద్దగా ఆకట్టుకునే అంశాలు లేకపోయినా ఈ చిత్రాన్ని బాగానే చూస్తున్నారు జనాలు. అంతా బానే ఉందిగాని ఈ చిత్రం చూసిన మహేష్ ఫ్యాన్స్ కు కొత్త టెన్షన్ పట్టుకుంది. వివరాల్లోకి వెళితే.. ‘సర్కారు వారి పాట’ సినిమాలో కీర్తి సురేష్ ను హీరోయిన్ గా ఫైనల్ చేసారు. అయితే.. ‘పెంగ్విన్’ చిత్రంలో కీర్తి సురేష్ తల్లి పాత్రలో నటించింది. గర్భిణీ స్త్రీగా కూడా కనిపించింది. ఆమె ఫేస్ మాత్రం ‘నేను శైలజ’ ‘నేను లోకల్’ ‘మహానటి’ సినిమాల్లో ఉన్నంత గ్లామర్ గా లేదు.

దాంతో మహేష్ సినిమాలో కీర్తి ఎలా కనిపిస్తుందా? అని.. అభిమానులు కంగారు పడుతున్నారు. అసలే ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో కూడా రష్మిక మహేష్ పక్కన సెట్ అవ్వలేదు అనే కామెంట్స్ వినిపించాయి. ఇప్పుడు కీర్తి సురేష్ కూడా డీ గ్లామరస్ గా తయారయ్యింది. కాబట్టి ‘సర్కారు వారి పాట’ లో మహేష్ సరసన సూట్ అవుతుందా.. ఆమె వల్ల సినిమాకి ఏమైనా నెగిటివిటీ వస్తుందా అని మహేష్ ఫ్యాన్స్ కంగారు కావచ్చు..!

Most Recommended Video

పెంగ్విన్ సినిమా రివ్యూ & రేటింగ్
మీ అభిమాన తారల, అరుదైన పెళ్లి పత్రికలు
ఐశ్వర్యవంతులను పెళ్లి చేసుకున్న అందమైన హీరోయిన్స్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus