‘ఉడ్తా పంజాబ్’ చిత్ర సెన్సార్ కాపీ లీకేజ్ కావడంతో ఆ చిత్ర బృందం సైబర్ క్రైమ్ సెల్ ను ఆశ్రయించారు. చిత్ర నిర్మాతల ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించిన ముంబై పోలీసులు.. సెన్సార్ కాపీ లీకేజ్ వెనుక పలువురు ప్రముఖులు ఉన్నారని గుర్తించారని సమాచారం.
‘సైబర్ సెల్ ఎక్స్ పర్ట్స్ ఈ కేసును వేగవంతంగా దర్యాప్తు చేస్తున్నాయి. ఈ చిత్రాన్ని ఆన్లైన్ లో విడుదల చేయడం వెనుక పలువురి ప్రముఖులు ఉన్నట్లు గుర్తించాము. అయితే వారినే అనుమానితులుగా మేము గుర్తించలేము. త్వరలోనే ఈ కేసులో పురోగతి సాధిస్తాము. వారిపై చట్టపరంగా అన్నీ చర్యలు తీసుకుంటామ’ని ముంబై పోలీసు అధికార ప్రతినిధి అశోకే దుధే తెలిపాడు.
కాగా డ్రగ్స్ కాంట్రవర్సీ నేపధ్యంలో షాహిద్ కపూర్, దల్జీత్ దొసంజ్, కరీనా కపూర్, అలియా భట్ లు ప్రధాన పాత్రల్లో అశోక్ చౌబే ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్రం జూన్ 17 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.