మన సినిమాలు పక్క ‘వుడ్’లకు వెళ్లడం… అక్కడి కథలు మనం తెచ్చుకోవడం ఎప్పటి నుంచో వస్తున్నదే అయితే ఇటీవల కాలంలో మన కథలు బాగా పక్క పరిశ్రమలకు వెళ్తున్నాయి. అందులో ఒకటి ‘భాగమతి’. అనుష్క ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమా ‘దుర్గామతి’ పేరుతో త్వరలో ఓటీటీ వేదికగా విడుదలవుతోంది. అయితే ‘దుర్గామతి’ అన్ని రీమేక్‌లలా ఉండదు అంటున్నారు దర్శకుడు జి.అశోక్. సినిమా నిర్మాణ ఖర్చు ఇటీవల కాలంలో బాగా పెరిగింది.
దీంతో నిర్మాతలు కూడా సేఫ్‌గా ఆలోచిస్తున్నారు. మంచి కథ లేదా ఎక్కడైనా హిట్ కొట్టిన సినిమాను రీమేక్ చేయాలని చూస్తున్నారు. అయితే ఆ నేటివిటీకి తగ్గట్టు మాతృకలో మార్పులు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. అక్షయ్‌కుమార్ ఎంత మంచి నటుడో, అంత మంచి నిర్మాత కూడా. ఆయన సహకారంతోనే ‘దుర్గామతి’ చక్కగా వచ్చింది. ‘భాగమతి’ హక్కులు తీసుకున్నాక ఓ రోజు అక్షయ్ కుమార్ పిలిచి.. ‘మీరే డైరెక్ట్ చేస్తే బాగుంటుంది’ అన్నారు’’ అంటూ చెప్పుకొచ్చారు జి.అశోక్.
‘‘‘భాగమతి’తో పోలిస్తే ‘దుర్గామతి’ సినిమాలో డిఫరెంట్‌గా ఉంటుంది. కథలో చిన్న చిన్న మార్పులు చేశాం. ఒరిజినల్ పాయింట్‌ను అలానే ఉంచి, మిగిలిన చోట్ల మార్పులు చేయడంతో కొత్త సినిమా చూసిన ఫీలింగ్ కచ్చితంగా కలుగుతుంది. దుర్గామతి’ సమయంలో టాలీవుడ్‌లో పెద్ద హీరోతో పని చేసే అవకాశం మిస్ అయ్యింది. అయితే తెలుగు, తమిళ భాషల్లో త్వరలో ఓ సినిమా ప్రారంభించబోతున్నా అయితే దాని కంటే ముందే బాలీవుడ్ మరో సినిమా చేయాల్సి ఉంది. త్వరలో ఆ సినిమా మొదలవుతుంది. నా ‘పిల్లజమిందారు’ లాంటి కథ కావాలని ఓ హీరో అడిగారు. దానికి తగ్గట్టుగా కథ సిద్ధం చేస్తున్నా’’ అని అశోక్ చెప్పారు.
Most Recommended Video
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
బ్రహ్మీ టు వెన్నెల కిషోర్.. టాలీవుడ్ టాప్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!