ప్రముఖ నటిపై కేసు.. అరెస్ట్ చేసిన పోలీసులు.. ఏమైందంటే?

  • March 21, 2024 / 06:24 PM IST

కొంతమంది నటీనటులు సినిమాలతో కంటే కూడా వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటుంటారు. ఈ లిస్ట్ కూడా చెప్పుకోడానికి పెద్దగానే ఉంటుంది. అయితే తమిళ నటి రాధ కూడా ఇదే లిస్ట్ కి చెందుతుంది అని చెప్పవచ్చు. గతంలో రాధ భర్తతో గొడవలు,అక్రమ సంబంధాలు,నిర్మాతల వేధింపులు.. వంటి ఇష్యులతో వార్తల్లో నిలిచేది.ఇప్పుడు మరోసారి ఈమె వివాదంలో చిక్కుకుంది. తాజాగా రాధ పై పోలీస్ కేసు ఫైల్ అయ్యింది. దీంతో ఈమెను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. మొదట్లో పలు తమిళ సినిమాల్లో నటించి పాపులర్ అయిన రాధ.. తర్వాత ఆఫర్లు కరువయ్యి, సీరియల్స్ లో నటించడం మొదలు పెట్టింది. అలాగే సినిమాల్లో కూడా చిన్న చితకా పాత్రలు చేస్తూ వస్తోంది. చెన్నైలోని సాలిగ్రామంలో ఈమె నివసిస్తూ ఉంటుంది. ఈమెకు ఓ కొడుకు కూడా ఉన్నాడు. అతని పేరు తరుణ్. అయితే ఇటీవల అతను ఫ్రాన్సిస్‌ రిచర్డ్‌ అనే యువకుడిపై దాడి చేసాడట. దీంతో అతనికి తీవ్రంగా గాయాలు అయ్యాయి.

కాబట్టి రాధ (Actress) , తరుణ్ ..లపై ఫ్రాన్సిస్‌ రిచర్డ్‌ తండ్రి డేవిడ్ విరుగంబాక్కమ్‌ పోలీస్‌స్టేషన్‌లో కంప్లైంట్ చేశాడు. దీంతో తరుణ్, రాధ..లని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. మరోపక్క గతంలో ఫ్రాన్సిస్‌ రిచర్డ్‌ ..రాధని అసభ్యకరమైన మాటలతో ధూషించాడట. అందుకే టైం చూసుకుని ఒక పథకం ప్రకారం.. రాధ, తరుణ్.. లు ఫ్రాన్సిస్‌ రిచర్డ్‌ పై దాడి చేసినట్టు పోలీసులు చెప్పుకొస్తున్నారు. అందులో ఎంతవరకు నిజముందో తెలీదు కానీ.. ఈ వార్త న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది.

ఓం భీమ్ బుష్ సెన్సార్ రివ్యూ!

విజయ్ కారు ధ్వంసం.. కారణం?
‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుండీ మరో గ్లింప్స్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus