Ponniyin Selvan Collections: ‘పొన్నియన్ సెల్వన్ – 1’ 6వ రోజు ఎలా కలెక్ట్ చేసిందంటే..?

  • October 6, 2022 / 05:14 PM IST

4 దశాబ్దాలుగా ‘పొన్నియన్ సెల్వన్’ ను తెరకెక్కించాలని కలలు కంటూ చివరికి కోలీవుడ్ మిడ్ రేంజ్ హీరోలతో ఆ లోటుని తీర్చుకున్నారు మణిరత్నం. దీని మొదటి భాగాన్ని ‘పీఎస్-1’ గా సెప్టెంబర్ 30న విడుదల చేశారు.లైకా ప్రొడక్షన్స్, మద్రాస్‌ టాకీస్‌ సంస్థలు కలిసి ఎంతో ప్రెస్టీజియస్ గా ఈ ప్రాజెక్టుని రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో రెండు భాగాలుగా నిర్మించారు. తమిళ్‌ తో పాటు హిందీ, తెలుగు, కన్నడ, మలయాళంలో ఈ సినిమాను ఏకకాలంలో విడుదల అయ్యింది.

విక్రమ్‌, జయం రవి, కార్తి, ఐశ్వర్య రాయ్‌ బచ్చన్‌, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శరత్‌కుమార్‌, విక్రమ్‌ ప్రభు, శోభిత ధూళిపాళ, జయరామ్‌, ప్రభు, పార్తిబన్‌, ప్రకాష్‌రాజ్‌ వంటి స్టార్ క్యాస్టింగ్ ఉండడంతో ఈ చిత్రం పై అంచనాలు ఏర్పడ్డాయి.కానీ తెలుగులో ఈ చిత్రానికి మొదటి రోజు మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ వీకెండ్ వరకు సూపర్ గా కలెక్ట్ చేసింది. అయితే వీక్ డేస్ లో ఈ మూవీ తడబడుతుంది. ఒకసారి 6 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 4.46 cr
సీడెడ్ 0.75 cr
ఉత్తరాంధ్ర 0.66 cr
ఈస్ట్ 0.52 cr
వెస్ట్ 0.42 cr
గుంటూరు 0.47 cr
కృష్ణా 0.48 cr
నెల్లూరు 0.33 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 8.09 cr

‘పొన్నియన్ సెల్వన్ – 1’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.8.48 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.9 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 6 రోజులు పూర్తయ్యేసరికి ఈ మూవీ రూ.8.09 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.0.91 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

నిన్న గాడ్ ఫాదర్, ఘోస్ట్ వంటి బడా సినిమాలతో పాటు స్వాతి ముత్యం అనే క్రేజీ సినిమా రిలీజ్ అవ్వడంతో ఈ మూవీ షోలు తగ్గిపోయాయి. ఈ వీకెండ్ మొత్తం స్టడీగా రాణిస్తే తప్ప బ్రేక్ ఈవెన్ అవ్వడం కష్టమనే చెప్పాలి.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus