మనసులోని మాటను బయటపెట్టిన పూజా హెగ్డే!

Advertisement

తెలుగులో ముకుంద, ఒక లైలా కోసం సినిమాలు చేసినప్పటికీ పూజా హెగ్డే కెరీర్ ఊపందుకోలేదు. ఆ తర్వాత బాలీవుడ్ లో “మొహెంజొ దారో” చిత్రంతో అడుగుపెట్టింది. ఈ సినిమా తీవ్ర నిరాశపరచడంతో టాలీవుడ్ కే వచ్చేసింది. ఈసారి గ్లామర్ డోస్ పెంచింది. దువ్వాడ జగన్నాథం లో బికినీ అందాలతో అందరినీ పడగొట్టేసింది. ఇక రంగస్థలంలో “జిగేల్ రాణి” అంటూ ఓ ఊపు ఊపింది. దీంతో వరుసగా ఆమెకి ఆఫర్లు వచ్చాయి. టాలీవుడ్ స్టార్ హీరోలైన ఎన్టీఆర్, మహేష్, ప్రభాస్ లతో కలిసి నటించే అవకాశం అందుకుంది. టాలీవుడ్ లోనే కాదు. బాలీవుడ్ నుంచి కూడా పిలుపు అందుకుంది. అక్షయ్‌కుమార్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న “హౌస్‌ఫుల్‌ 4 “లో పూజా హీరోయిన్ గా ఖరారు అయింది.

ఇంత బిజీగా ఉన్న ఈమెకు కొన్ని కోరికలు అలాగే ఉండిపోయాయి. అవి ఏమిటంటే కమర్షియల్ చిత్రాలతో పాటు బ‌యోపిక్ సినిమాల్లో కూడా న‌టించాల‌నుకుంటోంది. తాజాగా ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో ఈ విషయాన్ని ఆమె బయటపెట్టింది.`”బ‌యోపిక్ సినిమాల్లో న‌టించాల‌ని ఎప్ప‌ట్నుంచో అనుకుంటున్నాను. ముఖ్యంగా క్రీడాకారిణుల నిజ జీవిత పాత్ర‌ల్లో న‌టించాల‌ని ఉంది. సానియా మీర్జా, మిథాలీ రాజ్ బ‌యోపిక్‌ల్లో క‌నిపించాల‌ని ఉంది. అథ్లెట్‌ల పాత్ర‌ల్లో క‌నిపించేందుకు నా బాడీలాంగ్వేజ్ స‌రిగ్గా స‌రిపోతుంద‌ని అనుకుంటున్నాను” అని చెప్పింది. ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా అన్ని పరిశ్రమల్లో బయోపిక్ ల హావ నడుస్తోంది. అందుకే ఎవరైనా తనకి ఛాన్స్ ఇస్తారని కోరికని బయటికి చెప్పింది. మరి ఛాన్స్ ఇస్తారో లేదో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus