Pooja Hegde: పూజా హెగ్డే బర్త్ డే ని సెలబ్రేట్ చేసిన వెంకీ మామ, సల్మాన్ ఖాన్..ఫోటోలు వైరల్..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే… ఈ 3 ఏళ్లలో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే గా ఎదిగిన సంగతి తెలిసిందే. తెలుగుతో పాటు సౌత్ లోని అన్ని భాషల్లో రూపొందే సినిమాల్లోనూ అలాగే హిందీలో రూపొందే పలు సినిమాల్లోనూ హీరోయిన్ గా నటిస్తుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈ భామ బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందుతున్న ‘కిసీకి భాయ్ కిసీ క జాన్’ అనే చిత్రంలో నటిస్తూ బిజీగా గడుపుతోంది.

ఈ చిత్రంలో టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్ కూడా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన పూజా హెగ్డే కి అన్నయ్య పాత్రలో కనిపించబోతున్నట్టు చాలా కాలంగా ప్రచారం జరుగుతుంది. అంతేకాదు రాంచరణ్ కూడా ఈ చిత్రంలో ఓ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నట్టు భోగట్టా. మరోపక్క ఈ మూవీ తమిళంలో సూపర్ హిట్ అయిన ‘వీరం'(తెలుగులో ‘కాటమరాయుడు’ గా రీమేక్ అయ్యింది) కి రీమేక్ అనే టాక్ కూడా నడుస్తోంది.

ఇదిలా ఉండగా… ఈరోజు పూజా హెగ్డే పుట్టినరోజు. అయినప్పటికీ ఆమె ‘కిసీకి భాయ్ కిసీ క జాన్’ షూటింగ్లో పాల్గొంటుంది. ఈ క్రమంలో విషయం తెలుసుకున్న వెంకటేష్, సల్మాన్ ఖాన్ లు పూజకి స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చారు. దీంతో పూజా ఆనందం వ్యక్తం చేసింది. అదే ఆనందంలో ఉండగా.. సల్మాన్,వెంకటేష్ లు కేక్ తినిపించారు.ఇందుకు సంబంధించిన బ్యూటిఫుల్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాతో పాటుగా పూజ … మహేష్- త్రివిక్రమ్ ల సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తుంది.

1

2

3

4

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus