Pooja Hegde: పూజా హెగ్డేని ట్రోల్ చేయించారట.. షాకింగ్ కామెంట్స్ వైరల్ !

పూజా హెగ్డే (Pooja Hegde) కెరీర్ పడుతూ లేస్తూ సాగుతుంది. ‘ఒక లైలా కోసం’ (Oka Laila Kosam)  ‘ముకుంద’ (Mukunda)  వంటి క్రేజీ ప్రాజెక్టులతో కెరీర్ ప్రారంభించినప్పటికీ.. హృతిక్ రోషన్ (Hrithik Roshan) మూవీ ‘మొహంజదారో’ ఈమెను అమాంతం కింద పడినట్టు అయ్యింది. ఆ తర్వాత కొన్నాళ్ళకి హరీష్ శంకర్ (Harish Shankar) పిలిచి ‘డిజె'(దువ్వాడ జగన్నాథం) (Duvvada Jagannadham)  చేసుకునే ఛాన్స్ ఇచ్చాడు. తర్వాత ఈమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి రాలేదు.’అరవింద సమేత’ (Aravinda Sametha Veera Raghava) ‘మహర్షి’  (Maharshi) ‘అల వైకుంఠపురములో’ (Ala Vaikunthapurramuloo)  వంటి సినిమాలు ఈమెను స్టార్ హీరోయిన్ ని చేశాయి.

Pooja Hegde

తర్వాత వరుసగా బాలీవుడ్లో కూడా ఆఫర్లు వచ్చాయి. ఒక దశలో పాన్ ఇండియా హీరోయిన్ గా సత్తా చాటింది. హరీష్ శంకర్ వంటి దర్శకులకి డేట్స్ ఇవ్వలేనంత బిజీగా గడిపింది. అయితే ఆమె సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న టైంలో కొంతమంది స్టార్స్ కుళ్ళుకుంటూ ట్రోలింగ్ చేయించిన సందర్భాలు కూడా ఉన్నాయట. స్వయంగా పూజా ఈ విషయాన్ని బయట పెట్టింది. ఇటీవల ఆమె ఓ సందర్భంలో మాట్లాడుతూ.. “తమ పీఆర్ టీంకి లక్షల్లో డబ్బులు ఇచ్చి నన్ను ట్రోలింగ్ చేయించేవారు.

సోషల్ మీడియాలో నాపై బురదజల్లే వారు. నేను ఐరన్ లెగ్ అని మీమ్స్, పోస్టులతో నన్ను నెగిటివ్ చేశారు. నన్ను ట్రోల్ చేయించడానికి వాళ్ళు లక్షలు ఖర్చు పెట్టారని తెలిసినప్పుడు షాక్ అయ్యాను” అంటూ చెప్పుకొచ్చింది పూజ. ప్రస్తుతం పూజా హెగ్డే తమిళంలో సూర్యతో  (Suriya) ‘రెట్రో’ (Retro), విజయ్ తో  (Vijay Thalapathy) ‘జన నాయగన్'(Jana Nayagan)  వంటి పెద్ద సినిమాలు చేస్తుంది. హిందీలో కూడా ఛాన్సులు బాగానే ఉన్నాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus