సినిమాల షూటింగ్ల కోసం సెట్లు వేయడం అనేది కొత్త విషయం కాదు. కథ ప్రకారం కొన్ని లొకేషన్స్ కి వెళ్లి షూటింగ్ చేయాల్సి ఉంటుంది. కానీ కాస్ట్ అండ్ క్రూ మెంబర్స్ అందరినీ అనుకున్న ప్లేస్ కి తీసుకెళ్లి, అక్కడ పోలీస్ పర్మిషన్లు, షూటింగ్ కి పర్మిషన్లు వంటివి తీసుకుని.. అక్కడికి భోజనాలు తెప్పించడానికి జనాలను ఏర్పాటు చేసి.. ఇదంతా పెద్ద ప్రాసెస్. అందుకే ఒక స్టూడియోలో ఆర్ట్ డైరెక్టర్ల సాయంతో సెట్లు వేసి.. అక్కడ షూటింగ్లు నిర్వహిస్తుంటారు మేకర్స్.
ప్రమోషన్స్ లో కూడా ఆ సెట్ కోసం కోటి రూపాయలు పెట్టాం, రెండు కోట్లు పెట్టాం.. ఇలా గొప్పగా చెప్పుకుంటారు. ఒకవేళ ఆ సెట్స్ కనుక నాణ్యంగా లేకపోతే చాలా ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. అలాంటి ఘోరమైన సంఘటనలు గతంలో జరిగాయి.. ఇప్పుడు కూడా మరొకటి జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఒక స్టార్ హీరోయిన్ (Heroine) మెయిన్ రోల్ చేస్తున్న ఓ ఉమెన్ సెంట్రిక్ మూవీ షూటింగ్ ఒక ఏరియాలో జరగాలి. కానీ అక్కడ చేయడం ఇంకాస్త ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని భావించి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఆ ఊరికి సంబంధించిన సెట్ వేయాలని మేకర్స్ భావించారు.
వేశారు..! కానీ ఆ సెట్ నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది. ఈ క్రమంలో ఒక వ్యక్తి మరణించాడు. దీంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకో విషయం ఏంటంటే.. ఈ సినిమా షూటింగ్ కోసం లొకేషన్స్ వంటివి చూపించి, పర్మిషన్లు వంటివి ఇప్పించింది కూడా చనిపోయిన వ్యక్తే. దీంతో అతని కుటుంబానికి నష్టపరిహారంగా కోటి రూపాయలు ఇవ్వాలని అతని సన్నిహితులు,బంధువులు సినిమా దర్శకుడిని, నిర్మాతని డిమాండ్ చేశారు.
విషయం మీడియా వరకు, పోలీసుల వరకు వెళ్తే.. సినిమా రిలీజ్ అవ్వడం కష్టం. దీంతో సదరు నిర్మాత, దర్శకుడు బాధిత కుటుంబానికి రూ.30 లక్షలు చెల్లిస్తామని కన్విన్స్ చేసి సెటిల్మెంట్ చేసినట్టు సమాచారం. ఇక ఈ సినిమా విషయానికి వస్తే..ఇది కోవిడ్ టైంలో ఓటీటీలో రిలీజ్ అయిన సినిమాకి సీక్వెల్ అట. ఫస్ట్ పార్ట్ బాగా ఆడటంతో సెకండ్ పార్ట్ లో స్టార్ హీరోయిన్ ని (Heroine) తీసుకున్నారు. ఈ మధ్యనే టీజర్ కూడా వదిలారు.