ఆ వార్తల్లో ఎటువంటి నిజం లేదు : పూజా హెగ్దే మేనేజర్

వరుసగా స్టార్ హీరోల సరసన నటిస్తుంది. ఇక తన సోషల్ మీడియాలో కూడా తన హాట్ హాట్ పిక్స్ పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇక ఇలాంటి హీరోయిన్ పై రూమర్లు రాకుండా ఉంటాయా చెప్పండి. మన పూజా హెగ్దే పై కూడా రక రకాల రూమర్లు వస్తున్నాయి. వరుసగా అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్ వంటి హీరోల సరసన నటిస్తూ బిజీగా ఉంది. ఇక ఈమె మహేష్ తో కలిసి నటించిన ‘మహర్షి’ చిత్రం మే 9 న (ఈరోజు) విడుదల కాబోతుంది. ఇదిలా ఉండగా పూజా హెగ్దే పై వచ్చిన ఓ రూమర్ తెగ వైరలవుతుంది.

వివరాల్లోకి వెళితే.. ఇటీవల జరిగిన ‘మహర్షి’ ప్రీరిలీజ్ ఈవెంట్ ముగించుకుని పూజా హెగ్దే, ఆమె మేనేజర్ ఓ 7 స్టార్ హోటల్ కు వెళ్ళారట. హోటల్ నుండీ వీరిద్దరూ కారులో ఎయిర్పోర్ట్ కు వెళుతుండగా పోలీసులు పూజా హెగ్దే మేనేజర్ ను డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో బుక్ చేసినట్లు వార్తలొచ్చాయి. పూజా పూజా హెగ్దే ప్రయాణిస్తున్న కారుని పోలీసులు సీజ్ చేసారని… దీనితో మరో మరో కారులో పూజా హెగ్దే వెళ్ళిపోయిందని టాక్ నడిచింది. ఆమె మేనేజర్ పై మాత్రం పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఆ రూమర్స్ వచ్చాయి. అయితే ‘ఈ వార్తల్లో నిజం లేదని… తమ పై ఇలాంటి ఫేక్ న్యూస్ లు ప్రచారం చేస్తే వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని’ పూజా హెగ్దే మేనేజర్ హెచ్చరించినట్టు తెలుస్తుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus