Chennai Love Story First Review: ఇంటర్వెల్…కే హీరో కిరణ్ అబ్బవరం అంత షాక్ ఇస్తాడా?

[Click Here For Detailed Review]

కిరణ్ అబ్బవరం హీరోగా శ్రీ గౌరీ ప్రియా హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం చెన్నై లవ్ స్టోరీ (Chennai Love Story). ఎస్ కె ఎన్, సాయి రాజేష్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాతో రవి నంబూరి అనే సీనియర్ స్క్రీన్ ప్లే రైటర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. సిరి హనుమంత్, త్రిగుణ్ వంటి క్రేజీ ఆర్టిస్టులు కూడా ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. మణిశర్మ సంగీతంలో రూపొందిన పాటలు అన్నీ ప్రేక్షకుల నుండీ పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. గ్లింప్స్, ట్రైలర్ వంటి వాటికి కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. సినిమాపై ఫోకస్ పడేలా చేశాయి.

Chennai Love Story First Review

నిర్మాత ఎస్ కె ఎన్ అయితే చెన్నై లవ్ స్టోరీ అనేది కచ్చితంగా కల్ట్ క్లాసిక్ బ్లాక్ బస్టర్ అవుతుంది అని ధీమాగా చెబుతూ వచ్చాడు. ఆల్రెడీ సినిమాని ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది పెద్దలకి, స్నేహితులకి చూపించారు. వారి టాక్ విన్న తర్వాత నిర్మాత ఎస్ కె ఎన్ ..’ ఆనందంతో చొక్కా విప్పుకుని తిరిగేద్దాం అనుకున్నారు అంటూ ‘కో ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని తెలిపిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా రన్ టైమ్ ఆల్మోస్ట్ 3 గంటలు ఉంటుందట.

ఫస్ట్ హాఫ్ కొంత సస్పెన్స్ తో సాగుతుందట. ఇంటర్వెల్ ఎపిసోడ్ దగ్గర హీరో కిరణ్ అబ్బవరం రోల్ తో ఒక షాకింగ్ ఎలిమెంట్ ఇచ్చారట. సెకండాఫ్ లో హీరోయిన్ పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందట. మ్యూజిక్ కూడా బాగా వర్కౌట్ అయ్యింది అంటున్నారు. మొత్తంగా చెన్నై లవ్ స్టోరీ.. ఓ ఎమోషనల్ రైడ్ అని.. షాకింగ్ ఎలిమెంట్ టాలీవుడ్ సినిమాల్లో ఇప్పటివరకు లేనిదని అంటున్నారు. మరి ప్రీమియర్ షోలతో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

[Click Here For Detailed Review]

 

జన నాయగన్ థియేటర్లో త్రిష సందడి.. వీడియో వైరల్!

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus