రంగస్థలం 1985 లో స్పెషల్ సాంగ్ చేయనున్న పూజా హెగ్డే

  • October 4, 2017 / 08:39 AM IST

పొడుగు కాళ్ళ సుందరి పూజా హెగ్డే ముకుందలో హోమ్లీగా ఆకట్టుకోగా… దువ్వాడ జగన్నాథంలో అందచందాలతో అదరగొట్టింది. ముఖ్యంగా పాటల్లో అల్లు అర్జున్ తో పోటీగా స్టెప్పులు వేసింది. ఆమె స్టెప్పులను చూసిన డైరక్టర్ సుకుమార్ ముచ్చటపడ్డారు. దీంతో తన సినిమాలోనూ పూజలతో ప్రత్యేక సాంగ్ చేయించాలని ఫిక్స్ అయ్యారు. ప్రస్తుతం సుకుమార్ .. రామ్ చరణ్ తేజ్ తో రంగస్థలం 1985 మూవీ చేస్తున్నారు. క్యూట్ బ్యూటీ సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అనసూయ స్పెషల్ రోల్ పోషిస్తోన్న ఇందులో ఐటెం సాంగ్ కోసం చిత్ర బృందం కరీనా కపూర్, సోనాక్షి సిన్హా, ప్రియాంక చోప్రాలను అనుకున్నారు. అయితే చివరికి  పూజా హెగ్డే ని ఫైనల్ చేసినట్లు తెలిసింది.

త్వరలో రామ్ చరణ్, పూజా హెగ్డే లపై ఈ పాటను తెరకెక్కించనున్నారు.  ఆది పినిశెట్టి, జగపతిబాబు తదితరులు నటిస్తున్న రంగస్థలం1985 సినిమా ఫస్ట్ లుక్ ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రిలీజ్ చేయనున్నారు. రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ డిసెంబర్ లో రిలీజ్ కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus