పూజా హెగ్డేకి(Pooja Hegde) ఈ మధ్య సరైన అవకాశాలు రావడం లేదు. ఎన్నో ఆశలు పెట్టుకుని సూర్యతో చేసిన ‘రెట్రో’ కూడా డిజాస్టర్ అయ్యింది. విజయ్ తో చేసిన ‘జన నాయగన్’ రిలీజ్ కి ఇబ్బంది పడుతుంది. ఇదిలా ఉండగా.. ఇటీవల పూజా హెగ్డే ఓ ఆంగ్ల మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో భాగంగా ఆమె చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపుతున్నాయి అని చెప్పాలి.
పూజా హెగ్డే మాట్లాడుతూ..”నా కెరీర్లో మొదటి పాన్ ఇండియా సినిమాలో నటించే అవకాశం వచ్చింది. అది ఓ భారీ పాన్ ఇండియా ప్రాజెక్టు. ఓ స్టార్ హీరో అందులో లీడ్ రోల్ చేశాడు. అయితే దాని చిత్రీకరణ దశలో ఉన్నప్పుడు ఓ రోజు నేను క్యార్ వాన్లో ఉంటే.. ఆ స్టార్ హీరో నా అనుమతి లేకుండా లోపలి వచ్చేశాడు. అది నాకు అసౌకర్యంగా అనిపించింది. తర్వాత కూడా అతను నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ టైంలో నాకు ఏం చేయాలో అర్థం కాలేదు.
ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాను. తర్వాత ఓపిక నశించి అతన్ని లాగి పెట్టి కొట్టాను.వెంటనే అతను క్యార్ వాన్ నుండి బయటకు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అతనితో కలిసి నటించాలనే ఆసక్తి నాకు పోయింది. తర్వాత మా కాంబినేషనల్ సీన్స్‌ను డూప్‌తో షూట్ చేశారు” అంటూ చెప్పుకొచ్చింది.పూజా కామెంట్స్ సంచలనం సృష్టిస్తున్నాయి అనే చెప్పాలి. ఎందుకంటే.. ఆమె పరోక్షంగా ప్రభాస్ ను టార్గెట్ చేసి ఈ కామెంట్స్ చేసినట్టు అంతా చెబుతున్నారు.
‘రాధే శ్యామ్’ సినిమా షూటింగ్ టైంలో ప్రభాస్.. పూజా హెగ్డేని వేధించాడు అని యాంటీ ఫ్యాన్స్ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. పూజా హెగ్డే అసలు విషయం చెప్పి.. హీరో పేరు చెప్పకపోవడం వల్ల వచ్చింది ఇదంతా అని చెప్పాలి.