సినిమా ఇండస్ట్రీ లో హీరోయిన్లతో పోలిస్తే.. హీరోలకు ఎక్కువ రెమ్యునరేషన్లు ఇస్తుంటారు. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో హీరోలది కీలకపాత్ర. పైగా సినిమాలో ఫైట్స్, డాన్స్ లు అంటూ హీరోయిన్ల కంటే ఎక్కువ కష్టపడుతుంటారు. అయితే ఈ మధ్యకాలంలో దీనిపై వాదన బాగా పెరిగింది. హీరోలకు సమానంగా హీరోయిన్లు కూడా కష్టపడుతున్నారని కాబట్టి వాళ్లకి కూడా సమాన పారితోషికం ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై ముందుగా బాలీవుడ్ ముద్దుగుమ్మ తాప్సీ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది.
తనతో పాటు పని చేసే హీరోలకు తనకంటే ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తున్నారని.. వాళ్లకు ఇచ్చే రెమ్యునరేషన్ లో సగం కూడా తనకు ఇవ్వడం లేదని మొన్నామధ్య మండిపడింది. ఇప్పుడు పూజాహెగ్డే కూడా హీరోయిన్లకు ఎక్కువ రెమ్యునరేషన్ ఇవ్వాలంటూ పరోక్షంగా కామెంట్స్ చేసింది. ఇటీవల కరీనా కపూర్ ఓ సినిమా కోసం రూ.12 కోట్లు డిమాండ్ చేసినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై రియాక్ట్ అయిన పూజాహెగ్డే.. తన వాల్యూని బట్టి కరీనా కపూర్ రెమ్యునరేషన్ అడిగిందని..
అంత మొత్తం ఇవ్వాలా..? వద్దా..? అనేది నిర్మాతలు నిర్ణయిస్తారని చెప్పింది. మహిళలు తమ విలువను తెలుసుకున్నప్పుడే.. వాళ్లకు కావాల్సినవి అంత ఎక్కువగా పొందగలుతారు అంటూ చెప్పుకొచ్చింది. ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా చెలామణి అవుతోన్న పూజా స్పెషల్ అప్పియరెన్స్ కూడా భారీగా డిమాండ్ చేస్తోంది.
Most Recommended Video
ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!