సరైనోడు కి జోడి దొరికింది

స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ సరైనోడు చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ చిత్రం తర్వాత తమిళ దర్శకుడు లింగుస్వామితో కలిసి నటించడానికి సిద్దమయ్యాడు. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తికావడానికి కొంత టైం అవుతున్న కారణంగా .. హరీష్ శంకర్ కు ఓకే చెప్పాడు. ఈ దర్శకుడు మెగా ఫ్యామిలీకి గబ్బర్  సింగ్, సుబ్రమణ్యం ఫర్ సేల్ వంటి హిట్లను అందించాడు. ఇప్పుడు బన్నీ ని తొలిసారి డైరక్ట్ చేయనున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ స్టార్ నిర్మాత అల్లు అర్జున్ తో ఆర్య, పరుగు తీశారు. ఏడేళ్ల గ్యాప్ తర్వాత బన్నీ ఈ బ్యానర్లో మళ్లీ చేస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్న ఈ మూవీ ఆగస్టులో సెట్స్ మీదకు వెళ్లనుంది. ప్రీ ప్రొడక్షన్ పనుల్లో హరీష్ టీమ్ నిమగ్నమైంది.

తాజాగా ఈ చిత్రానికి సంభందించిన వార్త బయటికి వచ్చింది. ముకుంద సినిమాలో గోపికగా ఆకట్టుకున్న ముంబై సుందరి పూజ హెగ్డే ను ఈ చిత్రంలో హీరోయిన్ గా సెలెక్ట్ చేసినట్లు తెలిసింది. తెలుగులో ఒక లైలా కోసం, ముకుంద సినిమాల్లో నటించిన ఈ భామ ‘మొహంజదారో’ సినిమాలో హృతిక్ రోషన్ సరసన నటించే రావడంతో బాలీవుడ్ కి వెళ్ళింది. ఆ సమయంలో వేరే ఏ చిత్రాన్నిఅంగీకరించలేదు.  మొహంజదారో’ పూర్తి కావడంతో పూజ అల్లు అర్జున్ సరసన నటించడానికి డేట్స్ ఇచ్చినట్లు టాక్.  భారీ బడ్జెట్ తో తెరకెక్కించే ఈ చిత్రాన్ని 2017 వేసవి సెలవుల్లో రిలీజ్ చేసేందుకు నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus