మరో బిగ్గెస్ట్ ఆఫర్ కొట్టేసిన పూజా హెగ్డే

  • January 19, 2021 / 10:23 PM IST

పూజా హెగ్డే లక్కేమిటో గాని పట్టిందాల్లా బంగారం అవుతోంది. కెరీర్ మొదట్లో కొన్ని డిజాస్టర్స్ తో సతమతమైనప్పటికి కొన్నేళ్ల తరువాత మాత్రం వరుస ఆఫర్లతో బిజీగా మారింది. ఇక ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ హిట్స్ తో రెమ్యునరేషన్ డోస్ కూడా పెంచేస్తోంది. ఇటీవల బ్యూటీ మరొక స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది.ఆ స్టార్ హీరో మరెవరో కాదు. కోలీవుడ్ తలపతి విజయ్. మాస్టర్ సినిమాతో సంక్రాంతికి సాలీడ్ వసూళ్లు అందుకున్న విజయ్ నెక్స్ట్ నెల్సన్ దిలీప్ కుమార్ తో సినిమా చేయబోతున్నాడు.

ఆ సినిమా కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కనుంది. ఇక ఆ సినిమాలో హీరోయిన్ గా పూజ హెగ్డే ఫిక్స్ అయినట్లు టాక్ వస్తోంది. దాదాపు చిత్ర యూనిట్ సభ్యులందరు బుట్టబొమ్మను ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఇక మరికొన్ని రోజుల్లో అఫీషియల్ ఎనౌన్స్మెంట్ కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక నెక్స్ట్ పూజా హెగ్డే, ప్రభాస్ రాధే శ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. అలాగే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా కూడా ఈ సమ్మర్ లోనే విడుదల కానుంది.

ఇక సల్మాన్ ఖాన్ తో కూడా ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలే కాకుండా అమ్మడు మరో రెండు పెద్ద సినిమాలను వెయిటింగ్ లిస్ట్ లో పెట్టినట్లు సమాచారం.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus