టాలీవుడ్‌లో హీరో – దర్శకుడు కాంబినేషన్‌లే కాదు.. దర్శకుడు – హీరోయిన్ కాంబినేషన్లు కూడా ఫేమస్. వారిద్దరూ కలసి ఓ సినిమా చేస్తే చూడాలని, సినిమా అనౌన్స్ అయితే మురిసిపోవాలని చాలామంది ఫ్యాన్స్ ఉంటారు. అలాగే ఆ కాంబోలో సినిమా అనౌన్స్ అయితే తమ ట్రోలింగ్ సత్తాకు పరీక్ష పెట్టాలని చూసే ట్రోలర్లు కూడా ఉన్నారు. ఆ ట్రోలింగ్ కారణమేమీ ఉండదు.. హీరోల మీద అభిమానం/ కోపం అలా దర్శకులకు మీదకు వచ్చేస్తుంది. ఆ విషయం పక్కన పెడితే.. ఇప్పుడు అలాంటి డైరక్టర్ – హీరోయిన్ కాంబో రిపీట్ అవ్వబోతోంది అని టాలీవుడ్ వర్గాల మాట.
టాలీవుడ్‌లో మోస్ట్ అవైటెడ్ దర్శక హీరోయిన్ కాంబినేషన్లలో త్రివిక్రమ్ – పూజా హెగ్డే ఒకటి. వీరి కాంబోలో ఇప్పటివరకు వచ్చిన సినిమాలు.. అందులో ఆమెను గురూజీ చూపించిన విధానం బాగా ఫేమస్. అందుకే ఆ కాంబో కోసం వెయిటింగ్ చేస్తుంటారు. ‘గుంటూరు కారం’ సినిమా నుండి ఆమెను తప్పించిన/ ఆమె తప్పుకున్న విషయం మీకు తెలిసిందే. ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావడం వల్లే అలా ఆమె తప్పుకుంది అని అప్పట్లో వార్తలొచ్చాయి. ఇక ఇద్దరూ కలసి పని చేసే అవకాశమే లేదన్నారు ఆ రోజుల్లో.
అయితే ఇప్పుడు వెంకటేశ్ హీరోగా తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం – ఏకే 47’ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం పూజా హెగ్డేను తీసుకున్నారు అని ఓ వార్త టాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అదే జరిగితే త్రివిక్రమ్, పూజ తిరిగి కలసిపోయారు అని చెప్పొచ్చు. త్వరలో నెల రోజుల భారీ షెడ్యూల్ ప్రారంభమవుతుంది అని ఇటీవల సినిమాటోగ్రాఫర్ రవి కె.చంద్రన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. మరి షెడ్యూల్‌లో పూజా ఏమన్నా పాల్గొంటుందేమో చూడాలి.
పూజకు ఇప్పటికే సరైన విజయం దక్కి చాలా కాలమైంది.. ‘కూలీ’ సినిమాలో చేసిన స్పెషల్ సాంగ్‌కి మంచి పేరే వచ్చింది. మరిప్పుడు వెంకటేశ్‌తో మరోసారి ప్రత్యేక గీతం చేస్తుందేమో చూడాలి. ‘ఎఫ్ 3’ సినిమాలో పూజ స్పెషల్ సాంగ్ చేసిన విషయం తెలిసిందే.