‘మొదటి సినిమా’ తో హీరోయిన్ గా ఎంట్రీ .. అచ్చం తెలుగు అమ్మాయిలా అందులోనూ పక్కింటి అమ్మాయిలా కనిపించిన పూనమ్ బజ్వా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ అమ్మడు అటు తర్వాత ‘ప్రేమంటే ఇంతే’ అనే చిత్రంలో కూడా నటించింది. అయితే అప్పుడు ఈ అమ్మడిని ఎవ్వరూ పట్టించుకోలేదు కానీ నాగార్జున తో ‘బాస్’ సినిమాలో నటించిన తర్వాత బాగా ఫేమస్ అయ్యింది.
అవ్వడానికి ముంబై బ్యూటీ అయినప్పటికీ తెలుగింటి అమ్మాయిలా ఉంది అని ప్రేక్షకులేంటి… దర్శక నిర్మాతలు కూడా ప్రశంసించారు కానీ అవకాశాలు మాత్రం ఇవ్వలేదు. ఆ ప్రశంసలు కేవలం అల్లు అర్జున్ హీరోగా చేసిన ‘పరుగు’ సినిమాలో హీరోయిన్ ఆక్కగా చేయడానికి మాత్రమే పనికొచ్చాయి. అయితే ఈ అమ్మడికి అవకాశాలు ఎందుకు రాలేదు అనేది చాలా మందికి అంతు చిక్కని ప్రశ్న..!
ఇదిలా ఉంటే.. ఈ బ్యూటీ తాజాగా తన ఇన్స్టా గ్రామ్ లో ఓ ఫోటో పోస్ట్ చేసింది. వైట్ షర్ట్ ధరించి ఎంతో హాట్ లుక్ లో … కుర్రకారుకి చమటలు పట్టించేలా ఉంది ఆ పిక్. ఈ ఫోటో చూసిన వారు… ‘ఈ అందాల విందు ఓకే.. సినిమాలు చేసేది ఉందా’ అంటూ ప్రశ్నిస్తున్నారు. ఆ విషయం ఈమెను అడిగితే ఏం చెబుతుంది… దర్శక నిర్మాతలు ఆఫర్లు ఇచ్చి కదా చెప్పాల్సింది..!
Most Recommended Video
ఈ 17 ఏళ్లలో బన్నీ వదులుకున్న సినిమాలు ఇవే!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు!
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్