మరోసారి పవన్ పై పూనమ్ సెటైర్..?

చూడటానికి చాలా గ్లామర్ గా ఉన్నప్పటికీ.. హీరోయిన్ గా కూడా కొన్ని సినిమాలు చేసినప్పటికీ నిలదొక్కుకోలేకపోయింది పూనమ్ కౌర్. ‘మాయాజాలం’ ‘ఒక వి చిత్రం’ ‘శౌర్యం’ ‘నాగవల్లి’ ‘శ్రీనివాస కళ్యాణం’ వంటి చిత్రాల్లో నటించినప్పటికీ ఈమె గురించి పెద్దగా ఎవ్వరికీ తెలీదనే చెప్పాలి. కానీ పవన్ ను టార్గెట్ చేస్తూ గతకొంత కాలం నుండీ పవన్ కళ్యాణ్ పై చేస్తున్న కామెంట్స్ తో మాత్రం ఈమె బాగా పాపులర్ అయ్యింది. ఇక పూనమ్ కౌర్ ను అలాగే పవన్ కళ్యాణ్ ను లింక్ చేస్తూ కత్తి మహేష్ ఎంత దుమారం రేపాడో కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే పవన్ పై అన్ని ఆరోపణలు వస్తున్నప్పటికీ.. అవి నిజమా.. కాదా.. అన్నది మాత్రం ఎప్పుడూ పూనమ్ కౌర్ డైరెక్ట్ గా మాట్లాడింది లేదు.

Poonam Kaur With Pawan Kalyan

దీంతో కేవలం ఇవన్నీ పవన్ రాజకీయ జీవితం పై బురద జల్లే ప్రయత్నాలే.. అని అంతా ఫిక్సయిపోయారు. ఇదిలా ఉండగా ఇప్పుడు కూడా పూనమ్.. తన సోషల్ మీడియాలో చేసిన కామెంట్ పెద్ద చర్చకు దారి తీసింది.”ఓ అబద్దాల కోరు రాజకీయనాయకుడు కాగలడు కానీ, లీడర్ మాత్రం కాలేడు” అంటూ పూనమ్ ట్వీట్ చేసింది. అయితే ఈ ట్వీట్ ఎవరికోసం చేసింది ప్రస్తావించలేదు… ‘జస్ట్ ఏ థాట్’ (ఓ చిన్నఆలోచన) అంటూ హ్యాష్ ట్యాగ్ పెట్టింది. అయితే ట్వీట్ పవన్ కోసమే పెట్టిందని కొందరు.. పవన్ అభిమానులు పూనమ్ పై మండిపడుతున్నారు. అయినప్పటికీ ఆమె రియాక్ట్ కాకపోవడం గమనార్హం.

Poonam Kaur about Pawan Kalyan

విజిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఖైదీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus